Saturday, 28 November 2026

వార్తలు

తెలంగాణకు ఆర్టికల్‌ 371-డి వర్తించదు: కె.కేశవరావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆర్టికల్‌ వర్తించదని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు చేయాలంటే రాజ్యంగ సవరణ అవసరమని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. దిగ్విజయ్‌సింగ్‌కు…

భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఆరుగురి మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ లోని నైనిటాల్‌ జిల్లా భీమల్‌ ప్రాంతంలో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడి అరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ…

అక్రమంగా 70 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుకున్న రెవెన్యూ అధికారులు

నెల్లూరు : జిల్లాలోని సూళ్లూరు పేటలో బియ్యం వ్యాపారి ఇంటిపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 70 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సోనియాతో ముగిసిన సీఎం కిరణ్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి):కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అందుకు గల కారణాలను సీఎం కిరణ్‌ సోనియాకు వివరించినట్లు సమాచారం. అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సీఎం కిరణ్‌కుమార్‌ను సోనియాగాంధీ ఆదేశించినట్లు తెలుస్తుంది.

కిల్లి కృపారాణి నివాసాన్ని ముట్టడించిన ఐకాస

శ్రీకాకుళం: సమైక్యాంధ్ర ఐకాస నేతలు కేంద్ర మంత్ర కిల్లి కృపారాణి నివాసాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని  ఈ సందర్భంగా ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు.

సోనియాతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం 10 జన్‌పథ్‌లో భేటీ అయ్యారు. నేడు కోర్‌ కమిటీ సమావేశం జరగనుంది. మరి కొద్ది గంటల్లో కోర్‌కమిటీ భేటీ జరగనున్న నేపథ్యంలో 10 జన్‌పథ్‌లో అధినేత్రి సోనియాతో…

సినీదర్శకుడు కోదండరామిరెడ్డికి మాతృవియోగం

ఇందుకూరుపేట: ప్రముఖ సినీ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తల్లి రమణమ్మ (82) శుక్రవారం ఉదయం మృతి చెందారు. కోదండరామిరెడ్డి స్వగ్రామమైన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శుక్రవారం ఉదయం అమె అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.…

దిగ్విజయ్‌ను కలిసిన సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేతలు

ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ను సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సందర్భంగా ఐకాస నేతలు దిగ్విజయ్‌ను కోరారు.

మిశ్రమంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. యూరోప్‌ మార్కెట్లలో జరమనీ సూచీ ఒక శాతానికి పైగా పెరిగింది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సూచీలు అర శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ…

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన పోలీస్‌ అధికారి

అనంతపురం: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులే నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. కడప పోలీస్‌ కంట్రోల్‌ రూంలో సీఐగా పనిచేస్తున్న అర్జున్‌ నాయక్‌ తన భార్య పద్మలత భాయితో అనంతపురం జిల్లా నల్లమాడ పంచాయతీకి నామినేషన్‌ వేయించారు. ఈ స్థానం మహిళకు…