Saturday, 28 November 2026

వార్తలు

నీటితో నిండిన గోదావరి నది

రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో కురస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దవళేశ్వరం వద్ద కాటన్‌ బ్యారేజి నుంచి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఆస్పత్రి నుంచి హృతిక్‌ రోషన్‌ డిశ్చార్జ్‌

ముంబై,(జనంసాక్షి): బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ను గురువారం ఉదయం హిందూజా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. తాను బ్రహ్మాండంగా ఉన్నానని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన హృతిక్‌ ఫోటోలకు పోజిస్తూ తెలిపాడు. సబ్‌ డ్యూరల్‌ హెమటోమా వ్యాధితో…

నిండుకుండను తలపిస్తున్న కళ్యాణి డ్యాం

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డి శివారులో కళ్యాణి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కళ్యాణి డ్యాం నిండుకుండను తలపిస్తుంది. ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఐదు వందల క్యూసెక్కుల నీరు వచ్చి…

ప్రేమజంటపై దాడి: అమ్మాయి హత్య

కడప,(జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ జిల్లా కలసపాడు మండలం తంబళ్లపల్లెలో ప్రేమజంట పై అమ్మాయి తరపువారు దాడి చేశారు. కుత్తులతో దాడి చేసి ప్రియురాలిని హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన ప్రియుని పరిస్థితి విషమంగా ఉంది.

7గంటలకు దిగ్విజయ్‌తో భేటీ కానున్న డిప్యూటీ సీఎం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఆయన దిగ్విజయ్‌ని కలిసి తెలంగాణ అంశంపై చర్చించనున్నారు.

కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన అధికారులు

విజయవాడ సబ్‌కలెక్టరేటు: కృష్ణా డెల్టాలోని తూర్పు ప్రధాన కాలువకు ప్రకాశం బ్యారేజీ వద్ద గురువారం 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. విజయవాడ నీటి పారుదల శాఖ ఎస్‌ఈ కేఎల్‌ నరసింహమూర్తి గుంటూరు నీటిపారుదల శాఖ ఎస్‌ఈ…

సౌదీలో యువరాణి అరెస్టు

కాలిఫోర్నియా: సౌదీ యువరాణి మేషల్‌ అలెబాన్‌ (42) బుధవారం అరెస్టయ్యారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న అమె ఒక మహిళను అక్రమంగా తరలించడమే కాక అమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్భంధించినట్లు అరోపణలు ఎదుర్కొంటన్నారు. ఆ మహిళతో బలవంతంగా పనిచేయించుకుంటున్నారని రాకుమారిపై నేరం…

హస్తినాకు బయలుదేరిన రాష్ట్ర మంత్రులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం, తెలంగాణ రోడ్‌మ్యాప్‌, తదితర అంశాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర మంత్రులు హస్తినాకు బయలుదేరారు. ఢిల్లీకి బయలుదేరిన వారిలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, గీతారెడ్డి, డీకే అరుణ ఉన్నారు.

ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌. శ్యామసుందర్‌ను అనంతపురం ఎస్పీగా, సీఐడీ విభాగంలో డీఐజీగా పని చేస్తున్న అనిల్‌కుమార్‌ను నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీగా బదిలీ అయ్యారు.