Wednesday, 25 November 2026

వార్తలు

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రభుత్వాధికారి

గుంటూరు,(జనంసాక్షి): రూ. 10వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు ఓ ప్రభుత్వాధికారి. నరసరావుపేట అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్న జాషువాను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఎస్పీ అమర్జిత్‌ బలిహార్‌కు అశ్రునివాళులు

రాంచి,(జనంసాక్షి): నిన్న జార్ఖండ్‌లో మవోయిస్టుల దాడిలో మృతిచెందిన పాకూర్‌ ఎస్పీ అమర్జిత్‌ బలిహార్‌కి గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌తో సహా పలువురు రాష్ట్ర ప్రముఖులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు,సిబ్బంది బుధవారం అశ్రునివాళులు అర్పించారు. జార్ఖండ్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ కార్యలయం ప్రాంగణంలో…

రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామా చేస్తా: రాయపాటి

గుంటూరు : రాష్ట్రాన్ని విభజిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. తాను ముమ్మాటికీ సమైక్య వాదినేనని, రిఫరెండం పెడితే సమైక్య రాష్ట్రానికే ఓటు వేస్తానని స్పష్టం చేశారు.

బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మణ్‌గా మురళి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మూడు నామినేటెడ్‌ పదవులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు భర్తీ చేశారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మురళి, రాష్ట్ర నీటిపారుదల అభివృధ్ది కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గంటా మురళీకృష్ణ, రాష్ట్ర గిడ్డంగుల…

యువ కన్నడ నటుడు హేమంత్‌ మృతి

బెంగళూరు,(జనంసాక్షి): యువ కన్నడ నటుడు హేమంత్‌(27) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. బెంగళూరులోని ప్రైవేట్‌ అతడు కన్ను మూశాడని హేమంత్‌ కుటుంబానికి చెందిన సన్నిహితుడొకరు వెల్లడించారు. నిన్న సాయంత్రం జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా హేమంత్‌కు ఛాతిలో నొప్పి వచ్చింది.…

ఖమ్మం జిల్లాలో పంజా విసిరిన మావోయిస్టులు

ఖమ్మం,(జనంసాక్షి): ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. వెంకట్రాపురం మండలం విజయపురి కాలనీలో పోలీస్‌ ఇన్ఫార్మర్‌ అనే నెపంతో భగత్‌ అనే వ్యక్తిని కాల్చి చంపారు. రెండు నెలల క్రితం జరిగిన పువ్వాడ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా భగత్‌ను…

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ : పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి ఈరోజు విడుదల చేశారు. ఈనెల 9న జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని తెలిపారు. మొత్తం రాష్ట్రంలోని 21,491 పంచాయతీలకు మూడు…

రసాభాసగా మారిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నగర శివార్లలోని పంచాయితీలను విలీనం చేసే విషయంపై వాగ్వాదం అధికార, విపక్ష సభ్యులు వాదోపవాదాలకు దిగారు. టీడీపీ, బీజేపీ, ఎంఐఎం విలీనాన్ని వ్యతిరేకించాయి. నగర శివార్లలోని పంచాయితీ…

ఈనెల 4నుంచి రాయలసీమ ఐకాస దీక్ష

హైదరాబాద్‌ : 52 మంది ఎమ్మెల్యేలతో ఈనెల 4నుంచి హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద 52గంటల దీక్ష చేపట్టనున్నట్లు రాయలసీమ ఐకాస ప్రకటించింది. రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ రాయలసీమ ఎమ్మెల్యేలు అంతా ఏకం కావాలని ఐకాస నేతలు కోరారు. తెలంగాణ…

మహిళ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన లలిత

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే ఆకుల లలితారాఘవేందర్‌ బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో బధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. జాతీయ మహిళా కాంగ్రెష్‌ అధ్యక్షురాలు అనితా వర్మ, పీసీసీ అధ్యక్షుడు బొత్స…