Wednesday, 25 November 2026

వార్తలు

సరూర్‌నగరర్‌లో మున్సిపల్‌ కార్మికుల ధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని సరూర్‌నగర్‌లోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మ్యాన్‌హోల్‌లో పడి మృతి చెందిన కార్మికులు మధు, శేఖర్‌ కుటుంబాలకు న్యాయం చేయలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఉత్తరాఖండ్‌ సీఎంను కలిసిన రాష్ట్ర మంత్రులు

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణను రాష్ట్ర మంత్రులు బలరాం నాయక్‌, శ్రీధర్‌బాబులు కలుసుకున్నారు. తెలుగు యాత్రికులను అదుకునేందుకు సహకరించాలని అయనకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు బహుగుణతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. సహాయ చర్యలపై అరాతీశారు.

బయ్యారం గనులపై దాఖలైన పిల్‌ను విచారణకు స్వీకరించిన

హైకోర్టు హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లాలోని బయ్యారం గనులను విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయించడంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు…

వనస్థలిపురం పీఎస్‌ పరిధిలో చోరి

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైకోర్టు కాలనీలో పలు ఇళ్లల్లో దుండగులు దొంగతనం చేశారు. రూ. 45 వేల నగదు, 40 తులాల బంగారం అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…

గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రదేశ్‌ కమిటీలో నూతనంగా నియామితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చర్చించనున్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు వివిధ శాఖల పనులను…

రెండున్నర టన్నుల ఎర్రచందనం స్వాధీనం

సంబేపల్లి : బొలెరో వాహనంలో దాదాపు రెండున్నర టన్నుల ఎర్రచందనాన్ని తరలిస్తుండగా కడప పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 50లక్షలు ఉంటుందని వారు చెబుతున్నారు. వాహనంలో ఉన్న వారు పోలీసులను చూపిన వెంటనే…

అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయంపై ఏసీబీ దాడి

కొత్తూరు : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సెక్టారు సూపర్వైజరు పాలక శాంతికుమారి రూ. 2వేలు తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రఘువీర్‌, సర్కిల్‌ ఇన్‌స్పెక్టరు ఎస్‌కె…

హోంమంత్రి, ఆర్థిక మంత్రి పై 420 కేసు

రంగారెడ్డి,(జనంసాక్షి): తెలంగాణపై మాట మార్చారన్న అభియోగంపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే,ఆర్థిక మంత్రి చిదంబరంలపై ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో 420 కేసు నమోదైంది. అడ్వకేట్‌ జేఏసీ వేసిన పిటిషన్‌పై స్పందించిన రంగారెడ్డి జిల్లా కోర్టు కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్‌…

స్వల్పంగా తగ్గిన బంగారం,వెండి ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలోని బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.27,380 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,500 గా ఉంది. కిలో వెండి…

డీఎన్‌ను కలిసిన కోదండరాం, ఐకాస నేతలు

హైదరాబాద్‌ : పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కోదండరాం, ఐకాస నేతలు ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఢిల్లీలో తెలంగాణపై జరుగుతున్న పరిణామాలు తెలుసుకునేందుకు డీఎస్‌ను కలిసినట్లు కోదండరాం చెప్పారు. రాజకీయ పార్టీలతో ఢిల్లీలో ఐకాస త్వరలో నిర్వహించనున్న…