Sunday, 22 November 2026

వార్తలు

శ్రీధర్‌బాబును కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీడీపీ శాసనసభ సభ్యులు ఇవాళ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీథర్‌బాబును కలిశారు. ఉద్దేశపూర్వకంగానే సభను వాయిదా వేస్తున్నారని వారు మంత్రి తెలిపారు. మరోసారి సభను వాయిదా వేస్తే బిల్లులను అడ్డుకుంటామని టీడీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు.

సభ వాయిదా వేస్తే బిల్లులు అడ్డుకుంటాం: తెదేపా

హైదరాబాద్‌ : తెదేపా సభ్యులు నేడు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబును కలిశారు. ఉద్దేశపూర్వకంగానే సభను వాయిదా వేస్తున్నారని వారు మంత్రికి తెలిపారు. మరోసారి సభను వాయిదా వేస్తే సాయంత్రం బిల్లులను అడ్డుకుంటామని తెదేపా సభ్యులు హెచ్చరించారు.

బీహార్‌ శాసనసభ నుంచి బీజేపీ వాకౌట్‌

బీహార్‌,(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నమ్మకద్రోహాన్ని నిందిస్తూ బీజేపీ శాసనసభ నుంచి వాకౌట్‌ చేసింది. మిత్రపక్షాలుగా ఉన్న ఈ పార్టీలు బీజేపీలో నరేంద్రమోడి వ్యవహారంతో పొత్తు విచ్చిన్నమైన విషయం తెలిసిందే.

బీహార్‌ అసెంబ్లీ నుంచి భాజపా వాకౌట్‌

పాట్నా : బీహార్‌ శాసనసభ నుంచి భాజపా వాకౌట్‌ చేసింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నితీశ్‌ నమ్మకద్రోహాన్ని నిందిస్తూ భాజపా సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేశారు.

ఇండియన్‌ ఇన్ఫోలైన్‌పై పోలీసుల దాడులు

మెదక్‌,(జనంసాక్షి): జహీరాబాద్‌లో ఇండియన్‌ ఇన్ఫోలైన్‌ కార్యాలయంపై ఈ ఉదయం పోలీసులు దాడులు నిర్వహించారు. బీమా పేరిట మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇండియన్‌ ఇన్ఫోలైన్‌ నిర్వహకుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ బయల్దేరిన ఉపముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీ బయల్దేరారు. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి  జనారెడ్డి కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆధ్యాపకుడి వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య

కృష్ణా : జిల్లాలోని ఎ. కొండూరు మండలం గొల్లమందలో మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విస్సన్నపేటలో ఓ అధ్యాపకుడి అసభ్య ప్రవర్తనను తట్టుకోలేక మనస్తాపంతో మౌనిక ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.దీంతో మౌనిక బంధువుల అధ్యాపకుడ్ని చితకబాది నిర్బంధించారు.

శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి జైస్వాల్‌

తిరుమల : తిరుమల శ్రీవారిని కేంద్ర బొగ్గు గనులశాఖామంత్రి ప్రకాష్‌ జైస్వాల్‌ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అలయం వద్దకు చేరుకున్న జైస్వాల్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం…

వరద పరిస్థితిపై చర్చిస్తున్నాం: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో సమావేశమైన కాంగ్రెస్‌ కోర్‌కమిటీలో ఉత్తరాఖండ్‌లో వరద పరిస్థితిపై చర్చిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లో నిన్నటి కంటే పరిరిస్థితి మెరుగైందని తెలిపారు.

ప్రభుత్వం తుగ్లక్‌లా వ్యవహరిస్తోంది: జేపీ

హైదరాబాద్‌ : తమకు నచ్చినప్పుడు ఒకలా…. నచ్చకపోతే మరోలా సభను నడుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తుగ్లక్‌లా వ్యవహరిస్తోంది లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్‌ నారాయణ విమర్శించారు. సభను అడ్డుకునే సభ్యులను ఒకసారి సస్పెండ్‌ చేస్తూ…. మరోసారి చేయకుండా… ప్రమాణాలు…