Sunday, 22 November 2026

వార్తలు

రోడ్డు ప్రమాదంలో 11 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): కోస్గి మండలం బోగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో -ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

భవనం పైకి ఎక్కిన పశువైద్య విద్యార్థులు

కడప జిల్లా : కడప జిల్లా ప్రొద్దుటూరులో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 115 మంది విద్యార్థులు పశువైద్య కళాశాల భవనంపైకి ఎక్కారు. పశువైద్య కళాశాలకు వీసీఐ గుర్తింపు ఇవ్వాలని విద్యార్థులు ఈరోజు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు.

ఏరియల్‌ సర్వేకు బయల్దేరిన ప్రధాని, సోనియా

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో వర్షాలు, వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు, సహాయక చర్యలను పరిశీలించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరారు.

ఎన్నికలకు దూరంగా ఉంటేనే మంచిది కోమటిరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ మంత్రులకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ప్రజలకు నమ్మకం కలిగేలా నిర్ణయం తీసుకుంటే మంచిదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తనతో పాటు మంత్రులంతా రాజీనామాలు చేసివుంటే…. తెలంగాణ ఎప్పుడో వచ్చేదని ఆయన వ్యాఖ్యానించారు.…

ధర్మాన, సబిత కస్టడీపై విచారణ 25కి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబిత ఇంద్రారెడ్డి బుధవారం సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. సీబీఐ కోర్టుకు సమర్పించిన సీడీ అస్పష్టంగా ఉందని, ఒరిజినల్‌ సీడీలను దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని వారు తమ మెమోలో…

సీపీఐ ఆధ్వర్యంలో కడప యూరేనియం ప్లాంట్‌ వద్ద ఆందోళన

కడప,(జనంసాక్షి): కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్‌ వద్ద సీపీఐ నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన బధవారం ఉద్రిక్తంగా మారింది. యురేనియం 2 వ ప్లాంట్‌ వద్దంటూ ఈసీఐఎల్‌ గేటు ముందు నారాయణతో సహా సీపీఐ నాయకులు ధర్నాకు…

131కి చేరిన మృతుల సంఖ్య

షిమ్లా : ఉత్తరాదిన వర్షబీభత్సానికి మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగానే 131కి చేరినట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌లో 102 మంది చనిపోగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో 29 మంది మృతిచెందారు. దాదాపు 73 వేల మంది యాత్రికులు హిమాలయ ప్రాంతాల్లోని వివిధ…

చిత్తూరు జిల్లాలో భన్వర్‌లాల్‌ పర్యటన

చిత్తూరు,(జనంసాక్షి): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుపతిలో ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓట్ల నమోదు ప్రక్రియలపై జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పక్షాలతో భన్వర్‌లాల్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల పమోదులో…

బస్సు, వ్యాను ఢీకొని 8 మంది మృతి

పుదుక్కొట్టాయ్‌ : ఉదుక్కొట్టాయ్‌, అరంతాంగి రహదారిలో స్కూలు పిల్లలు ప్రయానిస్తున్న వ్యాను మరో బస్సును ఢీకొనడంతో ఏడుగురు పిల్లలు, వ్యాను డ్రైవరు మరణించారు. పుదుక్కొట్టాయ్‌ సమీపంలోని విజయరఘునాథపురం గ్రామానికి చెందిన పిల్లలు ఈ రోజు ఉదయం బడికి వెళ్తుండగా…

దేశాన్ని కొల్లగొట్టేందుకు వైఎస్‌ ప్రయత్నం వర్ల రామయ్య

విజయవాడ : ఆర్‌బీఐ డైరెక్టర్‌గా విజయసాయిరెడ్డిని నియమించి దేశాన్ని కొల్లగొట్టేందుకు వైఎస్‌ ప్రయత్నించారని తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఆర్‌బీఐ డైరెక్టరుగా విజయసాయిని నియమించి ఉంటే జగన్‌ అక్రమార్జన 5 లక్షల కోట్లకు చేరేదన్నారు. జగన్‌ అక్రమాస్తుల…