Saturday, 21 November 2026

వార్తలు

కర్నూలు సిటీగా కర్నూలు రైల్వేస్టేషన్‌

కర్నూలు,(జనంసాక్షి): రైల్వేస్టేషన్‌ పేరును కర్నూలు సిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. జిల్లాలో పలుకొత్త రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు…

ఇంటర్నెట్‌ ఛార్జీలు తగ్గించిన వొడాఫోన్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఇంటర్నెట్‌ ఛార్జీలను వొడాఫోన్‌ 80 శాతం వరకు తగ్గించింది. 10 కేబీపై ఇప్పటివరకు చేస్తున్న 10 పైసల చార్జీని 2 పైసలకు తగ్గించింది. 2 జీ సేవలకు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుంది. ప్రస్తుతానికి కర్ణాటక, పశ్చిమ యూపీ,…

ఉత్తరకాశీలో చిక్కుకున్నవారి కోసం 12 బృందాలు

ఢిల్లీ : ఉత్తర కాశీలో చిక్కుకున్న వారికోసం 12 సహాయ బృందాలను ఏర్పాటు చేసినట్లు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి వెల్లడించారు. డెహ్రాడూన్‌ వద్ద ఏడు బృందాలు, హరిద్వార్‌ వద్ద ఐదు బృందాలు సహాయక…

అసెంబ్లీలో ఏడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో సాయంత్రం ప్రభుత్వం 7 బిల్లుఉ ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రజా భద్రత బిల్లు, విలువ ఆధారిత పన్ను బిల్లు, వ్యాట్‌ రెండో సవరణ బిల్లు, వృత్తులు, వ్యాపారులపై పన్ను బిల్లు, విద్యా సవరణ బిల్లు, ఎస్వీయూ సవరణ…

టీ.కాంగ్రెస్‌ భేటీకి దూరంగా ఉన్న దానం, ముఖేష్‌ గౌడ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌ నేతల విస్తృతస్థాయి సమావేశానికి మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌, ఆర్‌ వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరుగుతున్న ఈ సమావేశానికి 11 మంది మంత్రులు, ఏడుగురు ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు,…

కాంగ్రెస్‌ పార్టీ బలపడుతోంది: సీఎం

హైదరాబాద్‌ : రానున్న తొమ్మిది నెలల్లో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలపడుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 2014 ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీయే మళ్లీ ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు.

జాతీయ రాజకీయాల్లో తెరాస కీలకపాత్ర కేసీఆర్‌

హైదరాబాద్‌ : జాతీయ రాజకీయాల్లో తెరాస కీలక పాత్ర పోషించనుందని తెరాస అధినేత కేసీఆర్‌ చెప్పారు. కొత్తగా ఏర్పడే కూటమిలో తమ పార్టీ కీలక పాత్ర పోషించనుందన్నారు. ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీతో తమ పార్టీ నేత…

డైట్‌సెట్‌ ఫలితాలన విడుదల చేసిన మంత్రి శైలజానాథ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): డైట్‌సెట్‌-2013 ఫలితాలను విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి శైలజానాథ్‌ మంగళవారం విడుదల చేశారు. డైట్‌సెట్‌లో 53.6 శాతం సాధించారు. ఫలితాల కోసం http:dietcet.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చును.

ఉత్తరాఖండ్‌ సీఎంకు లేఖ రాసిన చంద్రబాబు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని లేఖలో కోరారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాజకీయ ఐకాస భేటీ

హైదరాబాద్‌ : టీఎన్జీవో భవన్‌లో తెలంగాణ రాజకీయ ఐకాస ఈరోజు మధ్యాహ్నం సమావేశమైంది. ఐకాస భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.