Saturday, 21 November 2026

వార్తలు

రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలిగా త్రిపురాన వెంకటరత్నం

హైదరాబాద్‌ : రాష్ట్ర మహిళా కమిషన్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పునరుద్ధరించారు. త్రిపురాన వెంకటరత్నం కమిషన్‌ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పరుచూరి జమున, సునీతా కృష్ణన్‌, మల్లీశ్వరి, కస్తూరి, ఫిరోజ్‌బేగంలు మహిళాకమిషన్‌ సభ్యులుగా నియమితులయ్యారు.

సీఎం కిరణ్‌ కుమార్‌ రాకతో వలసలు పెరిగాయి: శంకర్రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాకతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలు పెరిగాయని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శంకర్రావు కిరణ్‌కుమార్‌ రెడ్డిపై మండిపడ్డారు. కిరణ్‌ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే సుమారు…

శ్రీ వెంకటేశ్వర యూవర్శిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

చిత్తూరు జిల్లా: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డిగ్రీ మూడో సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజేంద్ర ఈ ఫలితాలను సోమవారం విడుదల చేశారు.

సరస్వతీ పుష్కరాల వద్ద హనుమజ్జయంతి

కాళేశ్వరం : కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా సుమారు ఐదువేల మంది భక్తులు త్రివేణి తీర్థసంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. హనుమజ్జయంతి పురస్కరించుకుని సుమారు నాలుగు వేల మంది హనుమాన్‌ భక్తులు శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని…

మినీ వ్యాన్‌ బోల్తా : పలువురికి గాయాలు

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కస్తూరిబా వసతిగృహం సమీపంలో మినీవ్యాన్‌ బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు బీమనపల్లి మండలం జిల్లెడ గ్రామంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనుల్లో…

టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సాధ్యం: హరీష్‌రావు

కరీంనగర్‌, (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలాంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా జరగడంలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి…

ఘనంగా హనుమజ్జయంతి

గుంతకల్‌ : అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కస్సాపురం నెట్టికంటి అంజనేయ స్వామి దేవస్థానంలో ఐదు రోజుల పాటు హనుమజ్జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా చివరిరోజైన సోమవారం అలయంలో శ్రీ సీతారామ స్వామి పట్టాభిషేకం జరిగింది.…

చైనా కోళ్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం:119

మంది మృతి బీజింగ్‌ : ఈశాన్య చైనా ప్రాంతంలోని ఒక కోళ్ల పరిశ్రమలో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదంలో 119 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు 300 మంది దాకా కార్మికులు పరిశ్రమలో ఉన్నట్లు సమాచారం. మంటలను…

ఏసీబీ వలలో రాయదుర్గం ఎస్సై

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఓ అవినీతి ఎస్సై ఏసీబీ వలకు చిక్కాడు. రాయదుర్గం ఎస్సై కోదాటి రాజేందర్‌ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోకాయుక్త ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ : బషీర్‌బాగ్‌లోని లోకాయుక్త కార్యాలయం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. సంతాన సాఫల్యం కోసం ఎమ్‌. ఆర్‌. టీ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ నిర్వాహకురాలు డా. రోజా రోయాట్టీ తమను మోసం చేసి రూ.…