Saturday, 21 November 2026

వార్తలు

చంద్రబాబును కలిసిన ప్రజాసంఘాల నేతలు

హైదరాబాద్‌ : తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ నేతలు ఆయన నివాసంలో కలిశారు. మహానాడులో తెలంగాణపై మరోసారి తీర్మానం చేసినందుకు వారు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. తెలంగాణలో దొరల రాజ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురానివ్వమని నేతలు…

తిరుమలలో భారీ వర్షం

తిరుపతి : తిరుమలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తిరుమల అలయ పరిసరాల్లోకి వర్షపు నీరు భారీగా చేరుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో సౌకర్యాలు లేక వర్షంలో భక్తులు తడుస్తున్నారు.

ఈ నెలలో తెలంగాణపై నిర్ణయం : ఆజాద్‌

న్యూఢిల్లీ : మరికొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి ఈ నెలలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి , కాంగ్రెస్‌ , రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌ తెలిపారు. పార్టీని వీడిన వారికి తెలంగాణ కంటే బంధువులు, కుటుంబ…

వస్త్ర వ్యాపారులను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే : బొత్స

విజయవాడ : ఏడాదిపాటు వస్త్ర వ్యాపారులను ఇబ్బందు పెట్టిన మాట వాస్తవమేనని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. వస్త్ర వ్యాపారుల పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే వ్యాట్‌ తొలగించినట్లు ఆయన విజయవాడలో తెలిపారు.

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

మనీలా : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.7గా నమోదైంది. భూప్రకంపనలతో కర్మెస్‌ ప్రాంతంలోని రెండు గ్రామాల్లో కొండ చరియలు విరిగిపడటంతో 8 మంది చిన్నారులు గాయపడ్డారరు. కిమద్‌జిల్‌ గ్రామంలో వంతెనతోపాటు నాలుగు పాఠశాల…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయి

తిరుమల : జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కోర్టు ప్రత్యేక అనుమతితో తిరుమలకు చేరుకున్న విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో మూడు గంటల పాటు గడిపారు. తిరుమలలో రద్దీ…

అగ్ని ప్రమాదానికి గురైన గ్లోకెం పరిశ్రమను పరిశీలించిన

మంత్రి పరవాడ : విశాఖ జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురైన గ్లోకెం ఔషధ పరిశ్రమను మంత్రి బాలరాజు పరిశీలించారు. ప్రమాదంలో కాలిబూడిదైన బ్లాకులను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.…

తెలంగాణపై అధిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చాయి: పాల్వాయి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సామరస్యపూర్వక వాతావరణం కల్పించే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి అన్నారు. తెలంగాణ ఇస్తున్నట్లు అధిష్టానం నుంచి తనకు సంకేతాలు వచ్చినట్లు చెప్పారు. జులై 5న పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని…

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

విశాఖపట్నం : రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి తెలంగాణ మీదుగా ఆవరించి ఉంది. సాయంత్రానికి క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుపాను…

మాచిగూడలో ఇద్దరు మహిళలం ఆత్మహత్య

ఆదిలాబాద్‌ : వాంకిడి మండలం మాచిగూడలో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఇద్దరూ పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.