Thursday, 19 November 2026

వార్తలు

వైఎస్‌ కుటుంబం వెంటే ఉంటాం: కొండా సురేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ కుటుంబం నుంచి విడిపోయే ప్రసక్తిలేదని కొండా సురేఖ చెప్పారు. కొండా మురళీ, సురేఖ దంపతులు జైలులో జగన్‌ను కలిపిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాము ఆ కుటుంబం వెంటే ఉంటామని చెప్పారు. పార్టీపై…

బాబు జీవితమంతా అవినీతిమయం:కన్నా

హైదరాబాద్‌, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును మించిన అవినీతి పరుడు రాష్ట్ర చరిత్రలోనే లేడని మంత్రి కన్నా లక్ష్మినారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన జీవితం అంతా అవినీతి మయం అన్నారు. చివరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో కూడా అవినీతి జరిగింది…

ఇందిరమ్మ కలల పథకంపై సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇందిరమ్మ కలలు పథకం పనితీరును ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సచివాలయంలో సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఎన్టీపీసీలో సౌరవిద్యుత్‌ కేంద్రానికి భూమిపూజ

రామగుండం, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసీ శాలపల్లిలో రాజీవ్‌ రహదారి సమీపంలో 25 మెగావాట్ల సౌర విద్యుత్‌ కర్మాగారం మొదటి విడతగా 72 ఎకరాల్లో 85 కోట్లతో చేపట్టిన 10 మెగావాట్ల కేంద్రానికి ఎన్టీపీసీ సాంకేతిక సంచారకులు…

కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: 2 జీ లైసెన్సుల కేసులో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై ఢిల్లీ హైకార్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

శిక్షణ శిబిరాల నిర్వహణపై కేసీఆర్‌ చర్చ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెరాస శక్షణ నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. శిక్షణ శిబిరాలు నిర్వహించాల్సిన పద్దతులు, విధివిధానాలపై చర్చ జరుపుతున్నారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టిన రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు

రంగారెడ్డి జిల్లా, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద జగిద్గిరి గుట్ట, రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్దిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

వారిని అనర్హులుగా ప్రకటించాలి: టిడిపి

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీ విప్‌ ధిక్కరించిన 9మంది టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ విప్‌ ధూళిపాళ్ల నరేంద్ర శాసనసభాపతికి విజ్ఞప్తి చేశారు. టిడిపి తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హుతపై ఈరోజు విచారణ జరిగింది. టిడిపి తరపున…

పరిగిలో మహిళను నరికి చంపిన ప్రియుడు

అనంతపురం, జనంసాక్షి: పరిగిలో వివాహేతర సంబంధం బెడిసికొట్టింది. లక్ష్మమ్మ అనే మహిళను ప్రియుడు నర్సింహప్ప నరికి చంపాడు. అనంతరం కత్తితో పోడుచుకుని తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది.

జగన్‌పై సిబిఐ వాదనతో విభేదించిన కోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన రెడ్డిపై సిబిఐ వాదనను నాంపల్లి సిబిఐ కోర్టు విభేదించింది. జగన్‌పై సిబిఐ మోపిన అభియోగాలను కోర్టు తోసిపుచ్చింది. నమ్మకం ద్రోహం అభియోగాన్ని కోర్టు కొట్టివేసింది. ఐసిసి 409సెక్షన్‌…