Thursday, 19 November 2026

వార్తలు

వందకు పైగా స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారం దిశగాసాగుతోంది. 104 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 16 చోట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.

సానుభూతి, సెంటిమెంట్‌ తాత్కాలికమేనని రుజువు చేశారు

తెదేపా నేత పెద్దిరెడ్డి హైదరాబాద్‌ : అవినీతి ఆరోపణలు ఉన్న వారికి ప్రజల మద్దతు ఉండదని కర్ణాటక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని తెదేపా నేత పెద్దిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిలో…

సొరబ్‌లో మధు బంగారప్ప విజయం

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో సొరబ్‌ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు  బంగారప్ప (జేడీఎస్‌) విజయం సాధించారు. ఆయన తన సోదరుడు కుమార బంగారప్పపై గెలుపొందారు.

కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు : బొత్స

హైదరాబాద్‌ : అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ప్రజలు మద్దతు పలికారని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో తప్పు జరిగితే విపక్షాల విమర్శల కంటే ముందుగా సరిచేసుకుంటామని…

85 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం ఆ పార్టీ 85 స్థానాల్లో విజయం సాధించింది. మరో 32 చోట్ల అధిక్యంలో కొనసాగుతోంది.

స్వచ్ఛమైన పాలనను అందిస్తాం : సిద్దరామయ్య

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌ సారధ్యంలో ఏర్పడే ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనను అందిస్తుందని కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య అన్నారు. ముఖ్యమంత్రి నియామకం అధిష్ఠానం చూసుకుంటుందని దీనికి వారం రోజుల పటచ్చని ఆయనన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ఆయన కర్ణాటక…

అదంతా మీడియా అసంతృప్తి : ఆనం

హైదరాబాద్‌ : ప్రభుత్వ విధానలపై మంత్రుల్లో అసంతృప్తి ఉందన్న దానిపై ఆర్థిక మంత్రి అనం రామనారాయణరెడ్డి స్పందించారు. అదంతా మీడియా అసంతృప్తి రాగమని అన్నారు. ఎక్కడో ఏదో సందర్బంలో మాట్లాడినవన్నీ కలిపి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఉప ముఖ్యమంత్రి అంశోక్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి, భాజపా అభ్యర్థి అశోక్‌ విజయం సాధించారు. ఆయన పద్మనాభనగర్‌ స్థానం నుంచి పోటీ చేశారు.

సిద్దరామయ్య విజయం

వరుణ : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన 18,500 ఓట్ల తేడాతో తన సమీపప్రత్యర్థిపై విజయం సాధించారు.

17 స్థానాల్లో జేడీ (ఎస్‌) విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జేడీ (ఎస్‌) 17 స్థానాల్లో విజయం సాధించింది. మరో 28 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.