Thursday, 19 November 2026

వార్తలు

ఆట ముగిసింది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంతో ఆట ముగిసిందని కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ వ్యాఖ్యానించారు. భాజపా అసలు రంగును ప్రజలు గ్రహించి తిరస్కరించారని ఆయనన్నారు.

2 చోట్ల భాజపా గెలుపు

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో భాజపా రెండు స్థానాల్లో విజయం సాధించింది. మరో 37 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్నారు.

సీఎం ఎవరనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది : ఖార్గే

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనేదీ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని కేంద్ర కార్మికమంత్రి మల్లికార్జునఖార్గే అన్నారు. అధిష్ఠానం సూచనల ప్రకారమే కాంగ్రెస్‌ శ్రేణులు నడుచుకొంటాయని ఆయన తెలిపారు.

అన్నీ ఫలితాలు ప్రకటించాకే స్పందిస్తాం : వెంకయ్య

న్యూఢిల్లీ : కర్ణాటకలో అన్నీ ఫలితాలు వెల్లడయిన అనంతరమే స్పందిస్తామని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. కర్ణాటక ఫలితాలను చూసి ఉప్పొంగిపోతున్న కాంగ్రెస్‌ ముందస్తు సార్వత్రిక ఎన్నికలను ప్రకటించాలని ఆయన సవాల్‌ విసిరారు.

పనిచేయని మోడీ మంత్రం : సిద్దరామయ్య

బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ మంత్రం పనిచేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌నేత సిద్దరామయ్య అన్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రభవం కనిపించిందని ఆయన పేర్కొన్నారు.

నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిక్యంలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ప్రకటించిన ఫలితాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 103 స్థానాల్లో ఆ పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది.

ఎన్నికల ఫల తాలు నిరుత్సాహపరిచాయి: ప్రహ్లాద్‌జోషీ

బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు తమకు నిరుత్సాహం కలిగించాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషీ అన్నారు. ఓట్ల చీలికతో కాంగ్రెస్‌ విజయ సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు. యడ్యూరప్ప ప్రభావం ఈ ఎన్నికల్లో లేదని ఆయన అన్నారు.

అవినీతి మంత్రులను తొలగించిన కేంద్రం: అంబటి

గుంటూరు: అవినీతి మంత్రులను కేంద్రం తొలగించడంలేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పిఎంఓలో నివేదికను ట్యాంపరింగ్‌ చేసినా కేసులు నమోదు చేయలేదన్నారు. అవినీతి మంత్రులను తొలగించడానికి కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు?…

గృహ నిర్మాణ నిధులు పెంపు

హైదరాబాద్‌, జనంసాక్షి గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులు 70 వేల రూపాయల వరకు పెంచినట్లు మంత్రి ఉత్తమ కుమార్‌ రెడ్డి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఇచ్చేనిధులు 80వేల రూపాయల వరకు పెంచినట్లు తెలిపారు.…