Thursday, 19 November 2026

వార్తలు

సంచలం సృష్టించిన గేల్‌ మ్యూజిక్‌ వీడియో

న్యూఢిల్లి: జమైకన్‌ క్రికెటర్‌ పిచ్‌ మీదే కాదు సంగీత, నృత్య వేదికలమీదా సంచలనాలు సృష్టించగలడని రుజువు చేసింది తాజా వీడియో. మూడు రోజుల క్రితం అప్‌లోడ్‌ అయిన ఫంకీ మ్యూజిక్‌ వీడియో బాలీవుడ్‌ నృత్యాల వరకూ అన్నిటిని తనదైన…

కడపలో అగ్ని ప్రమాదం

కడప: కడప జిల్లా  ఎన్‌టిఆర్‌ సర్కిల్‌లోని ఒక ఫర్నీచర్‌ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేస్తున్నారు.

లంచం తీసుకున్న మార్కెటింగ్‌ శాఖ అధికారి

గుంటూరు: మార్కెటింగ్‌ శాఖ అధికారి ఓబుల్‌ రెడ్డి ఒక వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. ఒక హూటల్‌లో  ఆయన ఒక వ్యక్తి నుంచి 50 వేలు రూపాయలు  లంచం తీసుకున్నారు . కాపుకాసి  ఏసిబి…

కాంచీపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు నిప్పు

చెన్నై: కాంచిపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు పిఎంకె కార్యకర్తలు నిప్పంటించారు. పిఎంకె వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు అరెస్టుకు నిరసనగా వారు బస్సుకు నిప్పంటించారు. రాందాస్‌ను పోలీసులు మంగళవారం విల్లుపురంలో అరెస్ట్‌ చేసిన  విషయం తెలిసిందే. జిల్లాలో  వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారన్న…

ఉప్పల్‌ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌, జనంసాక్షి:  ఉప్పల్‌ స్టేడియం వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఇవాళ ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా క్రికెట్‌ అభిమానులు భారీగా స్టేడియానికి తరలి వచ్చారు.…

బుద్వేల్‌లో యువకుడి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌లో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దొంగతనం చేశాడన్న అరోపణతో గ్రామస్థులు చితకబాదగా, ఆ బాధతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

ఆ ఛానళ్లలో ప్రకటనలు నిలిపివేసేలా ఒత్తిడి తెస్తాం: దాసరి

హైదరాబాద్‌: అనువాద ధారావాహికలను ప్రసారం చేసే తెలుగు ఛానళ్లకు ప్రకటనలు నిలిపివేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు హెచ్చరించారు. తెలుగు టెలివిజన్‌ పరిశ్రమ పరిరక్షణ సమితి డబ్బింగ్‌ సీరియళ్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి బాసటగా…

టైమ్స్‌ ఆస్పత్రి ఎండీ అరెస్ట్‌

విజయవాడ, జనంసాక్షి: టైమ్స్‌ ఆస్పత్రి ఎండీ హేమంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకంలో అవకతవకలకు పాల్పడినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. హేమంత్‌పై  467,468,471,419,420 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ…

ఫర్నిచర్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం

కడప : కడపలోని ఎన్టీఆర్‌ కూడలి వద్ద ఫర్నిచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగసిపడుతున్న మంటలను రెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

ఎఫ్‌డీఐలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

ఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులను సర్వోన్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదని, ఇవి చట్టవిరుద్ధం కావని సుప్రీంకోర్టు పేర్కొంది. చిల్లర వర్తకంలో విదేశీ…