Thursday, 19 November 2026

వార్తలు

బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ముంబయి ఇండియన్స్‌, సన్‌రైసర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతుంది.

మాతా శిశు మరణాల రేటుతగ్గిచాలి

నిర్మల్‌ అర్బన్‌,జనం సాక్షి:మాతా శిశు మరణాల రేటును తగ్గించాలని కుటుంబ సంక్షేమ శిక్షణ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త  హొలివియా బెంజిమిన్‌ సూచించారు. పట్టణంలోని ప్రసూతి ఆస్పత్రిలో నర్సులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పరిశీలించారు. మాతా శిశు మరణాల…

‘పెట్రో’ ఊరట

ఆదిలాబాద్‌ జనం సాక్షి:ప్రజలకు ఊరట లబించింది. లీటర్‌కు రూ.3 తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమలులోకి  వచ్చింది. ఆదిలాబాద్‌లో ప్రస్తుతం లీటర్‌కు రూ.72.52ఉండగా,రూ.3తగ్గడంతో రూ.69.52కు చేరుకుంది. జిల్లాలో ప్రతిరోజు 80వేలలీటర్ల పెట్రోల్‌…

కాంచీపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు నిప్పు

చెన్నై: కాంచిపురంలో ఎపిఎస్‌ఆర్టీసి బస్‌కు పిఎంకె కార్యకర్తలు నిప్పంటించారు. పిఎంకె వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు అరెస్టుకు నిరసనగా వారు బస్సుకు నిప్పంటించారు. రాందాస్‌ను పోలీసులు మంగళవారం విల్లుపురంలో అరెస్ట్‌ చేసిన  విషయం తెలిసిందే. జిల్లాలో  వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్నారన్న…

వికలాంగురాలిపై అత్యాచారం

సికింద్రాబాద్‌: ఆల్వాల్‌లో  ఒక వికలాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నాగరాజు, నరసింహ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

సిఎం దళిత ద్రోహి, రాబంధు:శంకరరావు

హైదారాబాద్‌: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మాజి మంత్రి శంకరరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. సిఎం దళిత ద్రోహి, రాంబందు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. తనను మంత్రి మండలి నుంచి తొలిగించడం, ఉపముఖ్యమంత్రి…

కేపీహెచ్‌బీలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

హైదారాబాద్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను  కేపీహెచ్‌బీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద మూడు లాప్‌టాప్‌లు, పది సెల్‌ఫోనులు , రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. భారీగా…

పాతకక్షలతో యువకుడిపై దాడి

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో దారుణం జరిగింది. శాయంపేట మండల కేంద్ర మాదారిపేటలో పాతకక్షలతో  కొమ్ముల సతీష్‌ అనే ప్రధాన నిందితుడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పోందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.…

ఏసీబీకి చిక్కిన ఓబుల్‌రెడ్డి

గుంటూరు, జనంసాక్షి: ఆహార ధాన్యాల సేకరణ అధికారి ఓబుల్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. గుంటూరులో ఓ హోటల్‌లో రూ. 50వేలు లంచం తీసేకుంటూ ఏసీబీ డీఎస్సీ నర్సింహారావు నేతృత్వంలో అధికారులు పట్టుకున్నారు. ఓబుల్‌రెడ్డిపై కేసు నమోదు…

కాంగ్రెస్‌ సర్కార్‌కు నూకలు చెల్లాయి:నారయణ

హైదారాబాద్‌: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వనికి నూకలు చెల్లాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ అన్నారు. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి విద్యుత్‌ ఛార్జీలతో పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని నారయణ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి…