Thursday, 19 November 2026

వార్తలు

హైకోర్టులో జానాకు ఊరట

హైదరాబాద్‌, జనంసాక్షి: మంత్రి జానారెడ్డికి హైకోర్టు ఊరట లభించింది. జానారెడ్డి ఆస్తులపై విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు  కొట్టివేసింది. కేసుకు విచారణకు అర్హత లేతని కోర్టు అభిప్రాయపడింది.

టాన్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

జైపూర్‌: జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఇవాళ్టి తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌కి టాన్‌ గెలుచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రాజస్థాన్‌ రాయల్స్‌, బెంగళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌ 4 గంటలకు…

జగన్‌,మోపిదేవి రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌ , జనంసాక్షి:  జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందాతులు వైఎస్‌ జగన్‌ , మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలకు వచ్చే నెల వరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఓఎంసీ, ఎమ్మార్‌ కేసు నిందితులు గాలి జనార్థన్‌రెడ్డి, అలీఖాణ్‌,…

హైకోర్టు ఉత్తర్వులపై క్రీడావర్గాల హర్షం

హైదరాబాద్‌: రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం గుర్తింపు లేకుండా క్రీడా సంఘాలకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వరాదని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఒలింపిక్‌ సంఘంతో సంబంధం లేకుండా శావ్‌ గుర్తింపుతో కొనసాగుతున్న సంఘాలకు ఈ తీర్పు…

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

జైపూర్‌, జనంసాక్షి: ఇక్కడ సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో ఇవాల్టి తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ బెంగళూరు రాయల్స్‌ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలుచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు పీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌…

ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డి , బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్‌లను , ఎమ్మార్‌ కేసులో సునీల్‌రెడ్డిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది.

జగన్‌ బెయిల్‌ మే 6కి వాయిదా

న్యూఢిల్లీ: వైకాపా అధినేత జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ బెయిల్‌ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కోర్టు సీబీఐకి నోటీసులు జారీచేసింది.

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.28 వేలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,890గా ఉంది. కిలో వెండి ధర రూ.47,400గా పలుకుతోంది.

మే 2న రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష

హైదరాబాద్‌: మే 2న రాష్ట్రవ్యాప్తంగా 622 కేంద్రాల్లో పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌ వెల్లడించారు. ప్రవేశ పరీక్షకు 2,51,483 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. మే 4న ప్రవేశ పరీక్ష కీ విడుదల…