Thursday, 19 November 2026

వార్తలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ ఉద్యమం కొనసాగిస్తాం అన్న ఈటెల

న్యూఢిల్లీ : తెలంగాణ ప్రజల ఆక్షాంక్షతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని తెరాస నేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం…

రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేశారు

గుంటూరు: కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దుగ్గిరాల రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.

ఆర్టీఏ తనిఖీలు

10 ప్రైవేటు ట్రావెల్స్‌ వాహనాలపై కేసులు హైదరాబాద్‌: విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్‌ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పది ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇందులో సీవీఆర్‌, శ్రీ…

అల్లూరి విగ్రహ ఏర్పాటులో విఫలమైన టీడీపీ

విశాఖపట్నం, జనంసాక్షి: పార్లమెంట్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటులో టీడీపీ విఫలమైందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఆరోపించారు. విగ్రహ ఏర్పాటుకు పార్లమెంట్‌ అనుమతిచ్చినా టీడీపీ స్పందించలేదన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకైన అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్‌లో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.…

వంద రోజుల్లో తెలంగాణ మద్దతిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో అన్యాయాన్ని ఇక ప్రజలు సహించరని భాజపా నేత ప్రకాశ్‌జవదేకర్‌ అన్నారు. ఐకాస ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని…

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి: తిరుపతి ఎమ్మేల్యే భూమన

హైదరాబాద్‌,జనంసాక్షి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కొత్తగా ఎంత మందిని నియమించారనే దానిపై…

సత్యాగ్రహ దీక్షకు హాజరైన భాజపా, తెరాస నేతలు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఐకాస ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు భాజపా, తెరాస, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఐకాస అధ్యక్షుడు కోదండరాంతోపాటు భాజపా జాతీయ నేత ప్రకాశ్‌ జవదేకర్‌, రాష్ట్ర అధ్యక్షుడు…

లోక్‌సభ స్పీకర్‌ అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగేందుకు స్పీకర్‌ మీరాకుమార్‌ అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభాకార్యక్రమాలను అడ్డుకోవద్దని నేతలను కోరారు. మరోవైపు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ విపక్ష నేత సుష్మాస్వరాజ్‌తో భేటీ…

గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌, పొన్నం ప్రభాకర్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజయ్య నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా ఈ ప్రదర్శన నిర్వహించారు.

మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రత్యేక టాన్క్‌ఫోర్స్‌

కర్నూలు: మహిళలపై వేధింపుల నిరోధానికి చర్యలు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ వెల్లడించారు. ఇందుకోసం సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను నియమించినట్లు ఆయన చెప్పారు.