Thursday, 19 November 2026

వార్తలు

7వ సారి అధ్యక్షునిగా ఎన్నికైన కేసీఆర్‌

నిజామాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అర్మూర్‌ చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ వరుసగా ఏడోసారి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

బోరుబావిలో పడిన ఏడేళ్ళ చిన్నారి

చెన్నై: తమిళనాడు కరూర్‌ జిఆ్ల అరవకురిచిలోశనివారం ఓ ఏడేళ్‌ళ చిన్నారి ప్రమాదవశాత్తు బోరు పడిపోయింది. చిన్నారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసుఉ ప్రయత్నిస్తున్నారు. బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోని దిగాయి.

జనసంద్రమైన విశాఖసాగరతీరం

విశాఖసట్నం, జనంసాక్షి: విశాఖ సాగరతీరం జనసంద్రమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగింపు సందర్భంగా వేలాదిమంది తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, నాయకుల రాకతో సాగరతీరం నిండిపోయింది. కాసేపట్లో తెలుగుదేశం బహిరంగ సభ ప్రారంభం కానుంది.

బాపట్లలో ప్రథమాంధ్రమహాసభ శతాబ్ధి ఉత్సవాలు

హైదారబాద్‌: మే 26న బాపట్లలో ప్రథమాంధ్ర మహౄసభ శతాబ్ధి ఉత్సబాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి చెప్పారు. తెలుగు ప్రజలందరూ ఉండాలనే ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. పార్టీలకతీతంగా ఈ ఉత్సవాల నిర్వహణ ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధులను…

పైలాన్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు

విశాఖపట్నం, జనంసాక్షి:  ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర విజయస్థూపాన్ని (పైలాన్‌) తెదేపా అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. విజయస్థూపం వద్ద ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు.. అనంతరం విజయస్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ,  లోకేష్‌,…

టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

జైపూర్‌. జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఈరోజు రాజస్థాన్‌ రాయల్స్‌, హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

తెరాస అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌

ఆర్మూర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఎన్నికయ్యారు. కేసీఆర్‌ వరసగా ఏడోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేసీఆర్‌ ఎన్నికను నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరుగుతున్న తెరాస అవిర్భావ సభలో ఆ పార్టీ ఎన్నికల అధికారి…

ప్రారంభైన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బాడ్మింటన్‌ నాని ప్రసాద్‌ మెమోరియల్‌ అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలను శనివారం ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు…

తెరాస ఆవిర్భావ సభకు చెరుకున్న కేసీఆర్‌

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరగనున్న తెరాస అవిర్భావ సభ వద్దకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేరుకున్నారు. సభావేదిక వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేశారు.

తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన తెరాస నేతలు

ఆర్మూర్‌, జనంసాక్షి: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో తెరాస అధినేత కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.