Thursday, 19 November 2026

వార్తలు

పుస్తకగోదాములో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: బొగ్గులకుంటలోని పుస్తకగోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడి గోదాములోని 4 అంతస్తుల్లోకి వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు.

గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది

నల్లజెర్ల: పశ్చిమగోదావరి జిల్లా నల్లజెర్ల మండలం చీపురుగూడెం రామాలయం భూముల్లో వెలిసిన గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఉదయం పోలీసుల సహాయంతో అధికారులు గుడిసెల తొలగింపు చేపట్టారు. అయితే ఈ చర్యను దళితులు అడ్డుకొని జాతీయ…

నేడు అతిరాత్రాన్ని సందర్శించిన డీజీపీ, సీబీఐ జేడీ

రంగారెడ్డి: అతిరాత్ర మహాయాగం రంగారెడ్డి ఇల్లా కీసరలో 12వ రోజుకు చేరింది. డీజీపీ దినేష్‌రెడ్డి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అతిరాత్రాన్ని ఈ ఉదయం సందర్శించారు. వారి వెంట జిల్లా అధికారులు, పోలీసులు ఉన్నారు.

నేడు ఐపీఎల్‌లో

కోల్‌కతా : ఐపీఎల్‌-6లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు జరగనుంది.

ఉదయం పర్యటనకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన కోసం ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి. కొత్తకోటకు చేరుకుంటారు. అమ్మహస్తం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

రూ.20కోట్లను నష్టపరిహారంగా ప్రభుత్వం అందజేస్తోంది

వాషింగ్టన్‌ : ముగ్గురిని కాల్చిచంపాడమే నేరంపై ఫిబ్రవరి నెలలో లాన్‌ఏంజిల్స్‌ పోలీసు శాఖకు చెందిన అధికారి క్రిస్టఫర్‌ డార్నర్‌ను పట్టుకునే క్రమంలో దినపత్రికనలను పంపిణీ చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసు అధికారులు గాయపరిచారు. ఈ క్రమంలో వారి కారును…

బంగారురథంపై వూరేగుతున్న మలయప్పస్వామిని దర్శించుకున్న భక్తులు

తిరుపతి: తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో బంగారు రథంపై వూరేగుతూ భక్తులకు  దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తిరమలకు తరలివచ్చారు.

జిల్లాలో పర్యటనించానున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బి. కొత్తకోట గ్రామంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి.కొత్తకోటకు చేరుకుంటారు. పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొని, లబ్ధిదారులకు…

పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది

పోర్ట్‌మోరెన్‌బై: పపువా న్యూగినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌ పై 6.4గా నమోదైందని యూఎన్‌ జియోలాజికల్‌ సర్వే సంస్థ తెలిపింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. రాబహల్‌కు 30 కిలోమీటర్ల దూరంలో  భూకంప కేంద్రాన్ని…

ఆర్టీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

కడప: రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో ఈ ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. మొత్తం నాలుగు యూనిట్లలో 840 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు పనులు చేపట్టారు.