Thursday, 19 November 2026

వార్తలు

రైతు చైతన్యయాత్రను ఉదయంమే ప్రారంభించిన మంత్రి

అనంతపురం: రైతు చైతన్యయాత్రను హిందూపురంలో మంత్రి రఘువీరారెడ్డి ఈ ఉదయం ప్రారంభించారు. ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి : ఈటెల

ఖమ్మం : జిల్లాలోని బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని తెరాస శాసన సభా పక్షనేత ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ ..దేశంలో సహజ వనరులున్న చోటే పరిశ్రమలు స్ధాపించాలని సూచించారు.విశాఖ స్టీల్‌ ప్లాంట్‌…

రపట్నుంచి రైతు చైతన్య యాత్ర :డీకె అరుణ

మహబూబ్‌నగర్‌ : రైతు చైతన్య యాత్ర కార్యక్రమాన్ని సీఎం కిరణ్‌ సోమవారం ప్రారంభించనున్నారని మంత్రి డీకె అరుణ తెలిపారు. జూరాల ఆయకట్టు కింద రైతాంగాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తామని డీకే అరుణ అన్నారు. బస్సు యాత్రలో వచ్చిన ఫిర్యాదులను…

తెగిపడ్డ విద్యుత్‌వైర్లు ,పలురైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

వరంగల్‌ : రైల్వే ట్రాక్‌లపై విద్యుత్‌ వైర్లు తెగిపడడంతో పలు రైళ్లకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సంఘటన వరంగల్‌ జిల్లా తాళ్ల పూసపల్లి రైల్వే స్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. దాంతో డోర్నకల్‌ స్టేషన్‌లో ఇంటర్‌ సిటీ, నవజీవన్‌…

గణిత మేధావి శకుంతలాదేవి కన్నుమూత

బెంగళూర్‌ : గణిత మేధావి శకుంతలాదేవి ఆదివారం బెంగళూర్‌లో కన్నుమూశారు.ఆమె హ్యూమన్‌ కంప్యూటర్‌గా గుర్తింపు ఉంది. గత కొద్దికాలంగా శ్వాస సంబందిత వ్యాదితో భాదపడుతున్న శకుంతలా దేవి చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఫీల్డింగ్‌ ఎంచుకున్న గిల్‌క్రిస్ట్‌

మొహలి: పూణే వారియర్స్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌ లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కెప్టెన్‌ గిల్‌క్రిస్ట్‌ టాస్‌ గెలిచి పిల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌ లో పూణే వారియర్స్‌ జట్టుకు ఫించ్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. ఈ…

సెహ్వగ్‌ హాప్‌ సెంచరి,ఢిల్లీ 102/ 0

ఢిల్లీ : ఐపీఎల్‌ లో ఢిల్లీ ఆటతీరు ఎట్టకేలకు గాడిన పడింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ డేర్‌డేవిల్స్‌ ముంబాయితో పోరులో గాడిన పడ్డారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 162 పరుగులు చేసి 163 పరుగుల లక్ష్యాన్ని…

అత్యాచారానికి గురైన బాలికను నాగపూర్‌ తరలించారు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఘస్‌సోర్‌ పట్టణంలో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను గత రాత్రి విమానంలో నాగపూర్‌ తరలించారు. 35 ఏళ్ల ఒక వ్యక్తి చాకొలెట్‌ ఆశ చూపి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి…

మెగా పుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటుచేయండి అని సీఎంను కోరారు

హైదరాబాద్‌: వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి శరద్‌పవార్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మెగా పుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శరద్‌ పవార్‌ను కోరారు.

బాలిక అదృశ్యం పోలీసు స్టేషన్‌ గ్రామస్థులు ముట్టడి

కృష్ణా జిల్లా: కృష్ణజిల్లా అగిరిపల్లి మండలం సీతారాంపురంలో 4 రోజుల క్రితం ఒక బాలిక అదృశ్యమైంది. బాలిక అదృశ్వంపై తల్లిదండ్రులు అగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఈరోజు పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు.