Tuesday, 17 November 2026

వార్తలు

మొదటి వికెట్‌ కోల్పోయిన ముంబై : సచిన్‌ ఔట్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే సచిన్‌ టెండుల్కర్‌ ఒకే పరుగుకు చేసి ఔటయ్యాడు.

ఆఫ్గాన్‌లో బాంబుల మోత

కాబూల్‌ : అఫ్గాన్‌లో హింసాత్మక ఘటనలు రోజరోజుకి పెరుతున్నాయి. ఏప్రిల్‌లో ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 182 మంది మృతిచెందారు.బుధవారం వివిధ ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడుల్లో పోలీసులు ,ఆరోగ్య కార్యకర్తలు సహా 24 మంది మృతి చెందారు.

ముంబై ఇండియన్స్‌ విజయలక్ష్యం 180

ఐపీఎల్‌ -6లో భాగంగా జైపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు కు 180పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్ధాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లనష్టానికి 179…

కసీఆర్‌మెదక్‌నుంచి పోటీ చేసే అవకాశం

మెదక్‌ : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఆధినేత కే చంద్రశేఖర్‌రావు మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి .ఈ విషయంలో ఆయన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మెదక్‌ రాష్ట్ర…

తాలిబన్‌ శిబిరంపై అమెరికా వైమానిక దాడి

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్‌ లో తాలిబన్ల శిక్షణ శిబిరంపై అమెరికా వైమానిక దాడి చేసింది. ఘటనలో ఐదుగురు తాలిబన్లు మృతిచెందగా ఏడుగురు గాయపడ్డారు. లడ్హా సబ్‌ డివిజన్‌లోని బాబాగఢ్‌లోని తాలిబాన్ల శిబిరంపై మానవ రహిత విమానం…

నిలకడగా ఆడుతున్న రాజస్థాన్‌

జైపూర్‌: ఐపీఎల్‌ -6లో భాగంగా సవాయ్‌ మాన్‌సింగ్‌ క్రికెట్‌ స్టేడియంలో ముంబాయ్‌ ఇండియన్స్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నిలకడగా ఆడుతుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌ 10 ఓవర్లు ముగిసే సరికి కేవలం…

హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ విజయం

పుణే : ఐపీఎల్‌ -6లో భాగంగా పుణేతో జరిగిన మ్యాచ్‌లోహైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు 119 పరుగులు సాధించగా 120 పరుగుల విజయలక్ష్యంతో దిగిన…

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేతలు

ఖమ్మం : పోలీసుల అదుపులో ఐదుగురు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. పామేడు పీఎస్‌ నుంచి మావోయిస్టు అగ్రనేతలను హెలికాప్టర్‌లో భద్రాచలం తరలించేందుకు పోలీసులు యత్నించడంతో హెలికాప్టర్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపినట్టు తెలిసింది. దీంతో హెలికాప్టర్‌ వెనుదిరిగినట్లు సమాచారం.…

తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మిన పరకాల

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంపై సమైక్యవాదులు మరోసారి విషం చిమ్మారు.గతంలో ఎన్నోసార్లు తెలంగాణ వాదులు హెచ్చరించినప్పటికి తమ వంకరబుద్దిని మార్చుకోకుండా మరోసారి తెలంగాణపై అసత్య ఆరోపణలు చేసారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రబాకర్‌కు తెలంగాణ పై అసత్య…