Tuesday, 17 November 2026

వార్తలు

నేడు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఇందిరమ్మ సంక్షేమ బాట కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9గంటలకు హైదరాబాద్‌ నుంచి ఆయన బయల్దేరతారు. సాయంత్రం ఆరు గంటలకు తిరిగివస్తారు.

తెరాస ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌ : తెరాస నుంచి శాసనమండలికి ఎన్నికై ముగ్గురు సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డి, మహమూద్‌ అలీలచే మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో భారో అగ్నిప్రమాదం

నల్లగొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం చెంగిచెర్ల సబ్‌స్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చింది. రూ. కోటికి పైగా ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగడంతో పలు గ్రామాలకు…

స్పీకర్‌ నాదెండ్లకు జగన్‌ వర్గ ఎమ్మెల్యేలలేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన 13 మంది జగన్‌ వర్గ ఎమ్మెల్యేలు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తమ శాసనసభ సభ్యత్యాలు తక్షణమే రద్దు చేసి నోటిపై చేయాలని జగన్‌ వర్గ…

జనంపైకి దూసుకెళ్లిన లారీ: ముగ్గురు మృతి

అనంతపురం, జనంసాక్షి: జిల్లా కేంద్రంలోని ముదిగుబ్బ మార్కెట్‌లో ఓ లారీ జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను తమకు…

రేపు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే న్యాయ సదస్సులో సీఎం పాల్గొంటారు.

విశాఖలో ఆధార్‌ కార్డుల కష్టాలు

విశాఖ : ఆధార్‌ కార్డుల కష్టాలు విశాఖ నగరంలో కొనసాగుతూనే ఉన్నాయి, నగరంలో వేలాది  మందికి కార్డులు అందలేదు . ద్వారకా నగర్‌ ఆధార్‌ కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే జనాలు బారులు తీరారు. ఈ కేంద్రం వద్ద…

40 లీటర్ల నాటుసారా స్వధీనం

మార్కాపురం : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మూలమడుగుతండాలో మూర్కాపురం ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. 40 లీటర్ల నాటుసారా, రెండు ద్విచక్రవాహలను స్వాధీనం చేసుకున్నారు,

థానే ప్రమాదంలో 38 కి చేరిన మృతుల సంఖ్య

థానే, జనంసాక్షి: మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని మరణిచిన 38 మంది మృతుదేహాలను వెలికితీశారు. 50 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఇంకా కొందరు…

రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ప్రారంభమైంది. సడక్‌బంద్‌, చలో ఆసెంబ్లీ, హైదరాబాద్‌లో బహిరంగ సభ, ఢీల్లీలో కార్యక్రమాలపై నేతలు చర్చిస్తున్నారు.