Monday, 16 November 2026

వార్తలు

అక్బరుద్దీన్‌ బెయిల్‌పై వాదనలు పూర్తి

సంగారెడ్డి: కలెక్టర్‌ను దూషించిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌  బెయిల్‌ షిటిషన్‌పై సంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే కేసులో అక్బర్‌ సోదరుడు అసదుద్దీన్‌ అరెస్టయి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

ఎన్నికల నియమావలిని అభ్యర్థులు పాటించాలి

ఆదిలాబాద్‌, జనవరి 29 ():  శాసన మండలి ఎన్నికల్లో అభ్యర్థులందరూ నియమ నిబంధనలను  కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ పేర్కొన్నారు. జిల్లాలో జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో  పట్టభద్రుల కోసం 65 పోలీంగ్‌ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం…

జానారెడ్డి తెలంగాణ ద్రోహి: రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ నేతల మధ్య పొరపొచ్చాలు బయట పడుతున్నాయి. తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా మంత్రి పదవి పట్టుకుని వేళ్లాడుతున్న మంత్రి జానారెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి తెలంగాణ ద్రోహి…

మంత్రులు రాజీనామా చేసి తప్పుకోవాలి : భాజపా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ ప్రాంత మంత్రులు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని భాజపా నేత విద్యాసాగర్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్‌ వైఖరిని ఇప్పటికే వెల్లడించకపోవడంపై ఆయన మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని…

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల ఫైర్‌

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాబోయే తెలంగాణను అడ్డుకున్నారని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు ఫైర్‌అయ్యారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు బద్ద వ్యతిరేకి అని ఎంపీ వివేక్‌, పొన్నం ప్రభాకర్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక సమస్య తెలంగాణకు కాంగ్రెస్‌…

కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: మూడో త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను భారతీయ రిజర్వు బ్యాంక్‌ ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను 25 బేసిన్‌ పాయింట్లు తగ్గించింది. 2012,  ఎప్రిల్‌  తర్వాత వడ్డీరేట్లను తగ్గించడం ఇదే తొలిసారి నగదు నిల్వల నిష్పత్తిని…

రాజీనామాలపై నిర్ణయాన్ని మధ్యాహ్నం ప్రకటిస్తాం : టీ కాంగ్రెస్‌ ఎంపీలు

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం వైఖరికి నిరసనగా లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాపై ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు తెలిపారు. తమ నిర్ణయాన్ని మధ్యాహ్నం ప్రకటిస్తామని ఎంపీలు వివేక్‌ రాజయ్య చెప్పారు. కాంగ్రెస్‌ ఎంపీలు…

ఆలీఖాన్‌ బెయిల్‌పై విచారణ 4కు వాయిదా

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితుడు, గాలి జనార్ధన్‌రెడ్డి పీఏ ఆలీఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఆలీఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లిలోని సీబీఐ కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది.

తెలంగాణ కోసం సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడు

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఓ యువకుడు సెల్‌ టవర్‌ ఎక్కాడు. జైతెలంగాణ నినాదాలతో హడలెత్తిస్తున్నాడు. ఎల్బీనగర్‌ బైరామల్‌గూడలోని సెల్‌ టవర్‌ ఎక్కిన ప్రవీణ్‌ అనే యువకుడు వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాడు. తెలంగాణ మంత్రులు…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 30,710 పలుకుతోంది. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర రూ. 28,650 గా ఉంది. కిలో…