Saturday, 14 November 2026

వార్తలు

నేడు ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌ : నీలం తుపాను వల్ల వరద ముంపునకు గురైన ప్రాంతాలను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం, బాధితులను పరామర్శించి సహాయకార్యక్రమాలను ముఖ్యమంత్రి పర్యవేక్షించనున్నారు.

నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా

విశాఖ: భారీ వర్షాల కారణంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో నేడు, రేపు జరగాల్సిన ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేశారు. కాకినాడ జేఎన్‌టీయు-కే పరిధిలో నేడు జరగాల్సిన అన్నీ పరీక్షలు వాయిదా వేసినట్లు సంబంధిత అధికారులు…

వరద బాధిత ప్రాంత పాఠశాలలకు సెలవు

శ్రీకాకుళం: భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునగడంతో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు నేడు సెలవును ప్రకటించారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో వరద ఉద్థృతి తగ్గకపోవడంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవును…

కోనసీమలో 22 పునరావాస కేంద్రాలు

తూర్పుగోదావరి: భారీ వర్షాలతో అతలాకుతలం అయిన కోనసీమలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితుల కోసం 22 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. 5,500 మందిని ఈ  కేంద్రాలకు తరలించారు. కోనసీమలో 1.5 లక్షల ఎకరాల వరి పంట…

గారలో అత్యధిక వర్షపాతం నమోదు

శ్రీకాకుళం: నీలం తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను భారీ వర్షాలు మొంచెత్తాయి. అత్యధికంగా గారలో 21.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. సంతబొమ్మాళిలో 15.2 పొలాకిలో 10.2 పూసపాటిరేగలో 9.5 టెక్కలిలో 8.6, ఆముదాలవలసలో 7.9 కోరుఉకొండలో 14.9,…

వాక్‌చేయండి ఫిట్‌నెస్‌ పెంచుకోండి : సానియా

హైద్రాబాద్‌, నవంబర్‌4(జనంసాక్షి): నడక మనిషికి మేలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ వాక్‌ చేసి ఫిట్‌నెస్‌ పెంచుకోవాలని హైద్రాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా అన్నారు. ఆదివారం ఉదయం కేబీఆర్‌ పార్క్‌లో నిర్వహించిన వాక్‌ ఫర్‌ ఫిట్‌నెస్‌లో ఆమె పాల్గొని…

హిమాచల్‌లో భారీ పోలింగ్‌

75 శాతం పోలింగ్‌ నమోదు డిసెంబర్‌ 20న ఫలితాలు సిమ్లా, నవంబర్‌ 4 (జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో పోలింగ్‌ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభ మైంది. ఉదయం 11 గంటల వరకు అన్ని ప్రాంతాల్లోను పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.…

నీతిలేని మీరు మాపై అవినీతి ఆరోపణలా ?

బాజాపాపై సోనీయా ధ్వజం ఎఫ్‌డీఐలు ప్రజాహితం కోసమే : ప్రధాని మాది చేతల ప్రభుత్వం : రాహుల్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి): పీకలలోతు అవినీతిలో కూరుకుపోయిన నీతిలేని ఎన్డీయే మాపై అవినీతి ఆరోపణలు చేయటంమేంటని యూపీఏ చైర్‌…

వైకాపాలో చేరిన గోపాలపురం ఎమ్మెల్యే

హైదరాబాద్‌: గోపాలపురం ఎమ్మెల్యే వనిత, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, జొన్నకూటి బాబూజీరావుతో పాటు పలువురు ఉభయగోదావరి జిల్లా నేతలు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరాగాల్సిన పాలిటెక్నిక్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.