Monday, 9 November 2026

తెలంగాణ

టీజేఏసీ శాంతి దీక్ష ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద తలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శాంతి దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు, టీఎన్టీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు హాజరయ్యారు

సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రుల సమావేశం

హైదరాబాద్‌,(జనంసాక్షి): క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి సమావేశమయ్యారు.

శాంతి దీక్షలో పాల్గొననున్న టీఎంయూ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సత్వరం ఏర్పాటు చేయాలని డియాండ్‌ చేస్తూ తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన శాంతి దీక్షలో ఈ రోజు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు పాల్గొననున్నారు. ఈ…

తెలంగాణ బిల్లు కోసం నేడు శాంతి ర్యాలీలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ రోజు జిల్లా కేంద్రాల్లో శాంతి ర్యాలీలు నిర్వహించాలని పీఆర్టీయూ నిర్ణయించింది. ఈ రోజు సాయంత్రం 4గంటలకు పీఆర్టీయూ…

సమ్మె విరమించిన 108 ఉద్యోగులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): వైద్య అత్యవసర సేవలు అందించే 108 సర్వీసులు ఈ రోజు నుంచి తిరిగి పూర్తి స్థాయిలో పనిచేయనున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ 108 ఉద్యోగులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 108 ఉద్యోగ…

సీఎం తీరుతోనే రాష్ట్రం తగులబడుతుంది : వివేక్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కనుసైగతోనే ఏపీ ఎన్టీవోలు ఆందోళలనకు దిగి సీమాంధ్ర ఉద్యమం నడుపుతున్నారని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు నీళ్లు, ఉద్యోగాలు రావని తప్పుడు ప్రచారంతో సీమాంధ్ర ప్రజలను తప్పు త్రోవ…

జూ. ఎన్టీఆర్‌ తెలంగాణపై వైఖరి చెప్పాలి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తండ్రి సమైక్య రాజీ’డ్రామా’ ప్రభావం తనయుడిపై పడింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ తెలంగాణపై తన వైఖరిని ప్రకటించాలని ఓయూ, కేయూ జేఏసీలు డిమాండ్‌ చేశాయి. లేకుంటే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనీయబోమని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం ఎన్టీఆర్‌ ఆండ్రి…

శాంతిర్యాలీకి అనుమతి కోరిన ఓయూ ఐకాస

హైదరాబాద్‌,(జనంసాక్షి): సెప్టెంబర్‌ 7న శాంతి ర్యాలీకి అనుమతివ్వాలని ఓయూ ఐకాస సెంట్రల్‌ జోన్‌ డీసీపీకి వినతి పత్రం సమర్పించింది. నిజాం కళాశాల నుంచి శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలంటూ డీసీపీకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొంది.

సీడబ్ల్యూసీ నిర్ణయానికి సీఎం కట్టుబడాల్సిందే

వరంగల్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో సహా సీమాంధ్ర మంత్రులంతా సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకట రమణరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు.

టెట్‌ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ వాయిదా పడింది. ఉద్యోగుల ఆందోనల నేపథ్యంలో సెప్టెంబరు ఒకటిన జరగాల్సిన ఈ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.