Sunday, 8 November 2026

తెలంగాణ

సీఎంతో జానారెడ్డి, సారయ్య భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్యలు సమావేశమయ్యారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి నగర శివారులో నిరసన తెలిపేందుకు అయినా అనుమతి ఇవ్వాలని సీఎంను కోరినట్లు సమాచారం.

ఛలో అసెంబ్లీలో పాల్గొంటాం: ఎమ్‌ జేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): చలో అసెంబ్లీలో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బింది పాల్గొంటారని తెలంగాణ మెడికల్‌ జేఏసీ తెలిపింది. తెలంగాణ జిల్లాల్లో అక్రమ అరెస్టులను ఆపకుండా అత్యవసర సేవలను నిలిపివేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. చలో అసెంబ్లీలో ప్రభుత్వం దమనకాండకు పాల్పడితే గాయపడ్డ వారికోసం…

పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రేపటి చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్శిటీ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓయూ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులను పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను…

మంత్రులు ప్రొటోకాల్‌ పాటించట్లేదు

హైదరాబాద్‌ : ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో మంత్రులు ప్రొటోకాల్‌ పాటించట్లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమ అరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉమ మాట్లాడుతూ… ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై సభాపతికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 9ఏళ్లయినా కాంగ్రెస్‌…

ఆరు నూరైన ఛలో అసెంబ్లీ జరుగుతుంది

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆరు నూరైన ఛలో అసెంబ్లీ జరిపి తీరుతామని ఎమ్మెల్యేలు గుండా మల్లేష్‌, ఈటెల రాజేందర్‌, యెండల లక్ష్మీనారాయణ గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు.…

గవర్నర్‌ను కలవనున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో అక్రమ నిర్బంధాలను నిలిపివేయాలని కోరుతూ సాయంత్రం 4:30 నిమిషాలకు టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌ను కలవనున్నారు.

ఏటీఎం చోరీ కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్‌ : అమీర్‌పేటలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎటీఎం చోరీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 13లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సనత్‌నగర్‌ పోలీసులు తెలిపారు.

తెలంగాణ వాదుల అరెస్టుపై హెచ్‌ఆర్సీని ఆశ్రయిస్తా: హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఛలో అసెంబ్లీ నేపథాన్ని పురస్కరించుకొని పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు , తెలంగాణవాదులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు గురువారం హైదరాబాద్‌ గురువారం హైదరాబాద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ…

ఓయు విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన ఓయూ విద్యార్థులను ఎస్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏర్పాటు చేసిన ఇనుప గేట్లను విద్యార్థులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు.

అభిప్రాయం చెప్పేందుకు హాజరవుతా: జానారెడ్డి

హైదరాబాద్‌ : బంగారు తల్లి పథకంపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘంలో సీఎం ఉండమన్నారని, తాను ఉండనని మంత్రి జానారెడ్డి చెప్పారు. కేవలం అభిప్రాయం చెప్పేందుకు మాత్రమే ఉపసంఘం సమావేశానికి హాజరవుతానని జానారెడ్డి వివరించారు.