Sunday, 8 November 2026

తెలంగాణ

సబిత, ధర్నాన జ్యుడీషియల్‌ కస్టడీ కోసం కోర్టులో సీబీఐ

మెమో హైదరాబాద్‌ : మాజీ మంత్రలు సబిత, ధర్మానకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించాలని సీబీఐ మెమో దాఖలు చేసింది. కేసు నుంచి బయటపడతామని సబిత, ధర్మాన మీడియాతో మాట్లాడటం దర్యాప్తునకు అటంకమని సీబీఐ పేర్కొంది. ధర్మాన, సబిత మీడియాతో…

భద్రాచలం రామాలయంలో పెరిగిన భక్తుల రద్దీ

భద్రాచలం : ఖమ్మం జల్లా భద్రాచలం రామాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు పూర్తికావస్తుండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి నిత్య కల్యాణంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.

కొడుకు మరణవార్త విని తండ్రి మృతి

ఎల్లారెడ్డి,(జనంసాక్షి): నిజామాబాద్‌ నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామానికి చెందిన విఠల్‌(33) బుధవారం హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మరణవార్త స్వగ్రామంలో ఉన్న తండ్రి దుర్గయ్య (58) వినగానే ఉన్నచోటే కుప్పకూలి మృతి చెందాడు. నాలుగు రోజుల…

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ 17 నుంచి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్‌ 2013 ఫలితాలను ఈరోజు సాయంత్రం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మెడికల్‌లో వెంకట్‌ వినీత్‌కు మొదటి ర్యాంకు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌`2013 ఫలితాల్లో మెడికల్‌లో హైదరాబాద్‌లోని రామచంద్రపురానికి చెందిన వెంకట వినీత్‌ మొదటి ర్యాంకు సాధించాడు. విజయవాడకు చెందిన రోహిత్‌కుమార్‌ రెండో ర్యాంకు , జగదీశ్‌ రెడ్డి మూడో ర్యాంకు సాధించారు.

ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు సాధించిన సాయిసందీప్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌`2013లో ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సాయి సందీప్‌రెడ్డి ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు.

మెడికల్‌లో 80 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ ఫలితాలను మంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. మెడికల్‌లో 80.79 శాతం ఉత్తీర్ణత సాధించారు.

నిర్మల్‌లో భారీ వర్షం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిరది. దాంతో పలు చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలు స్తంభించాయి. వర్షం వల్ల కొనుగోలు ధాన్యం తడిసిపోయింది.

ఎంసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్‌లో వచ్చిన మార్కులతో సహా ర్యాంకులను ప్రకటించారు.