Saturday, 7 November 2026

తెలంగాణ

వడదెబ్బతో 117 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శనివారం వడదెబ్బ తీవ్రతకు మృతి చెందిన వారి సంఖ్య 117కు చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 18 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో 12 మంది చొప్పున , కృష్ణా, కరీంనగర్‌, నల్గొండ…

కిరణ్‌ సర్కార్‌ ప్రజలను గాలికి వదిలేసింది: బీజేపీ

హైదరాబాద్‌, జనంసాక్షి: కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌ రెడ్డి విమర్శించారు. వారికి పదవులు, కుర్చీలు తప్ప ప్రజలు పట్టరన్నారు. ఎండలతో వందలాది మంది చనిపోతున్నా ఇప్పుడు…

వరంగల్‌ డీసీసీబీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ : వరంగల్‌ డీసీసీబీ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 28న ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి ప్రారంభిస్తామని డీసీఓ తెలిపారు.

దేశాన్ని డిజైన్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ హైదరాబాద్‌ : డిజైనింగ్‌ హబ్‌గా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ అన్నారు. వచ్చ ఐదేళ్లలో పదిహేను వేల క్రాఫ్ట్‌ డిజైనర్లను తయారు చేస్తామని ఆయన…

దేవాదాయ ధర్మాదాయ కార్యాలయంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : బొగ్గుల కుంటలోని దేవాదాయ ధర్మాదాయ కమిషనర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

వడదెబ్బకు ఆర్టీసీ బస్సులోనే వ్యక్తి మృతి

నిజామాబాద్‌, జనంసాక్షి: వడదెబ్బకు ఆర్టీసీ బస్సులోనే వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రయాణికుడు నందిపేట నుంచి నిజామాబాద్‌ వస్తుండగా మృతి చెందాడు. మృతుడి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు చెందిన రాజుగా గుర్తించారు.

మద్యం వ్యాపారులను ఎన్నికలకు దూరంగా ఉంచాలి

మద్యబహిష్కరణ వేదిక హైదరాబాద్‌ : మద్యం వ్యాపారులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని స్వచ్ఛంద మద్యబహిష్కరణ వేదిక డిమాండ్‌ చేసింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్కరూ మద్య నియంత్రణ ఉద్యమంలో పాలుపంచుకోవాలని హైదరాబాద్‌ ప్రెన్‌క్లబ్‌ లో ఏర్పాటు చేసిన…

సెంట్రల్‌ వర్సిటీలో ‘డిజైన్‌’ భవనానికి శంకుస్ధాపన చేసిన మంత్రి ఆనంద్‌శర్మ

హైదరాబాద్‌,జనంసాక్షి: గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ భవనానికి కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా హాజరయ్యారు.

రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన బలరాంనాయక్‌

వరంగల్‌, జనంసాక్షి: కె. సముద్రంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మానోతు కవిత, మాజీ మంత్రి రెడ్యానాయక్‌ పాల్గొన్నారు.

తెదేపా గెలుపు చారిత్రక అవసరం: చంద్రబాబు

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాంతీయ పార్టీగా అవతరించిన తెదేపా దేశ రాజకీయాల్లోనూ ఉనికి చాటుకుందని అన్నారు. 2009లోనే నగదు బదిలీ గురించి తెదేపా…