Saturday, 7 November 2026

తెలంగాణ

గ్రామీణ వికాస బ్యాంకులో అగ్ని ప్రమాదం

మెదక్‌జిల్లా, జనంసాక్షి: చేగుంట ఏపీ గ్రామీణ వికాస బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని కంప్యూటర్లు రికార్డులు కాలొబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంపీ వివెక్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.

కుటుంబాల కలహాలతో ముగ్గురు ఆత్మహత్య

అనంతపురం, జనంసాక్షి: నగరంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బీడీఎల్‌ ఉద్యోగి ఇంట్లో చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని సరూర్‌నగర్‌ మండలం అల్మాస్‌గూడలోని ఓ బీడీఎల్‌ ఉద్యోగి ఇంట్లో భారీ చోరి జరిగింది. దుండగులు 40 తులాల బంగారం , కిలో వెండిని దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు…

విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు పర్యాటకులు మృతి

ఖమ్మం, జనంసాక్షి: వి.ఆర్‌.పురం మండలం ఇప్పూర్‌లో పర్యాటక బస్సు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

22న కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 22న కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో…

సినీ హాస్యనటుడు అలీకి డాక్టరేట్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు ప్రేక్షకుల్ని గత మూడు దశాబ్దాలుగా నవ్వుల లోకంలో ముంచెత్తుతున్న ప్రముఖ హాస్య నటుడు అలీకి డాక్టరేట్‌ లభించింది. యూరోపియన్‌ యునైటెడ్‌ యూనివర్సిటీ అతనికి డాక్టరేట్‌ను ప్రధానం చేస్తుంది. ఈ నెల 25 న కోయంబత్తూరులో…

అనర్హత పిటిషన్లపై సభాపతి విచారణ

హైదరాబాద్‌ : అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివ్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి నాదెండ్ల మనోహర్‌ విచారణ చేపట్టారు. న్యాయవాదితో కలిసి టీడీఎల్పీ వివ్‌ ధూళిపాళ్ల నరేంద్ర ఈ విచారణలో పాల్గొన్నారు. విచారణకు ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి ,…

అంతరాష్ట్ర దొంగ అరెస్టు

వరంగల్‌: అంతరాష్ట్ర దొంగను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.11.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను 21 కేసులో నిందితుడని ఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.

రఘునందన్‌రావుతో ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నారు: ఈటెల

హైదరాబాద్‌ : కుట్రలో భాగంగానే తెరాస బహిష్కృత నేత రఘునందన్‌రావుతో అసత్యాలు మాట్లాడిస్తున్నారని తెరాస నేత ఈటెల రాజేందర్‌ మండిపడ్డారు. రఘునందన్‌రావుతో ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా గతంలో తెరాసను ఇలానే చీల్చాలని చూశారని…