Friday, 6 November 2026

తెలంగాణ

గుంటూరు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌ : గుంటూరు జిల్లా పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బయలుదేరి వెళ్లారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో గుంటూరు వెళ్లారు. ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి రైతుసదస్సును  ప్రారంభిస్తారు.

వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వం వహిస్తే తప్పేంటి

మంత్రి రామచంద్రయ్య వరంగల్‌ : చిరంజీవి చరిష్మాగల నాయకుడని, వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వం వహిస్తే తప్పేంటని మంత్రి సి. రామచంద్రయ్య ప్రశ్నించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారు తనపై విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు.…

ఇంటర్‌ సప్లిమెంటరీ రుసుము గుడువు రేపటి వరకు పెంపు

హైదరాబాద్‌ : ఇంటర్‌ మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్ష రుసుము చెల్లించాల్సిన గడువును ఇంటర్‌ బోర్డు రేపటి వరకూ పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది.

హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌ : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయేందుకు ఆయన ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.

భద్రాచలం ఐటీడీఏ క్వార్టర్స్‌ వద్ద పేలుడు

భద్రాచలం : భద్రాచలంలో ఐటీడీఏ పాత క్వార్టర్స్‌ వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి 20 అడుగుల మేర రాళ్లు ఎగిరిపడినట్లు తెలుస్తోంది.

బెల్టుషాపులు ఎత్తివేయాలని ఎక్సైజ్‌శాఖకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులు ఎత్తివేయాలని ఎక్సైజ్‌ శాఖకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం కార్యాచరణ చేపట్టాలని ఎక్సైజ్‌ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. నెలరోజుల్లోపు బెల్టుషాపులు ఎత్తివేసి నివేదిక సమర్పించాలని ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

సీఎంతో ఎలాంటి విభేదాలు లేవు : రఘువీరా

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి విభేదాలు లేవని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. వైఎస్‌పై సానుభూతి తప్ప వైకాపాపై ప్రజల్లో ఆదరణ లేదన్నారు. 2014లో కాంగ్రెస్‌ శ్రేణులు సమష్టిగా కృషి చేసి తిరిగి అధికారంలోకి వస్తామన్న నమ్మకాన్ని ఆయన…

ప్రచారానికే పథకం: మందకృష్ణ

సికింద్రాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అమ్మహస్తం పథకం ఫార్స్‌గా నిలుస్తుందని, బియ్యం కోటాను పెంచకుండా కేవలం ప్రచారానికే పథకాన్ని వినియోగిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ సంస్థ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. బుధవారం సికింద్రాబాద్‌లోని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో…

మైనింగ్‌ మాఫియాకు, మతతత్వ పార్టీకి గుణపాఠం

హైదరాబాద్‌ : కర్ణాటకలో మైనింగ్‌ మాఫియాకు, మతతత్వ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించినట్లే ఇక్కడే కూడా తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.…