Friday, 6 November 2026

తెలంగాణ

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయేందుకు గాను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఎంపీలు, మాజీ ఎంపీలు సైతం పాల్గొంటారు. చంద్రబాబును స్పీకర్‌ మీరాకుమార్‌ ఆహ్వానించడం శుభపరిణామమని తెదేపా…

సహారా ఇండియా ఆధ్వర్యంలో జాతీయగీతాలాపన

బెల్లంపల్లి పట్టణం : దేశవ్యాప్తంగా ‘భారత్‌ భావనా దివన్‌’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోని ఏఎంసీ మైదానంలో జాతీయగీతాపన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఐక్యతను పెంపొందించడానికి ఈ గీతాలాపన తోడ్పడుతుందని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం జె. నాగయ్య అన్నారు.…

చెట్టును ఢీకొని ఒకరి మృతి

కాగజ్‌నగర్‌ :పట్టణంలోని కాపువాడ ప్రధాన రహదారిపై మోటారు సైకిల్‌పై వస్తున్న దుర్గం నామ్‌దేవ్‌ (24) ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొని అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఉంది. ఈ మేరకు స్తానిక పోలీసు కేసు నమోదు చేశారు.

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా

బాలుడి మృతి ముగ్గురికి గాయాలు కమాన్‌పూర్‌, కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలంలోని పేరేపల్లి నుంచి రొంపికుంట గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్రగాలయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా…

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా: ఇద్దరు మృతి

కమాన్‌పూర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలంలోని పేరేపల్లినుంచి రొంపికుంట గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా , ముగ్గురికి తీవ్రగాయాలవడంతో వీరి పరిస్థితి విషమంగా ఉంది. పేరేపల్లి గ్రామానికి చెందిన గుర్రాల సంజీవ్‌(16),…

సచివాలయం వద్ద రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఓ వాహనం అదుపు తప్పి బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రధాన ద్వారం వద్ద పలువురు భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఐ అండ్‌ పీఆర్‌ విశ్రాంతి డైరెక్టర్‌…

ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు చంద్రబాబుకు ఆహ్వానం

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని చంద్రబాబుకు ఆహ్వానం లభించింది. లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ కార్యాలయం నుంచి తెదేపా అధినేత చంద్రబాబుకు అధికారికంగా ఈ ఆహ్వానం లభించింది.

ప్రారంభమైన స్థాయీ సంఘాల సమీక్షలు

హైదరాబాద్‌, జనంసాక్షి: అసెంబ్లీలోని శాసనసభ కమిటీ హాలులో స్థాయీ సంఘాల సమీక్షలు ప్రారంభమయ్యాయి. మానవ వనరుల స్థాయీ సంఘం సమావేశమై విద్యాపద్దులపై సమీక్ష చేపట్టింది. బడ్జెట్‌ పద్దులపై సమీక్ష నిమిత్తం ప్రభుత్వం 12 స్థాయీ సంఘాలను ఏర్పాటు చేసిన…

చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు అరెస్టు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బొల్లారం పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుంచి 46 తులాల బంగారం, అర కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు.

స్థాయి సంఘాల సమీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ కమిటీహాల్‌లో స్థాయీసంఘాల సమీక్షలు ప్రారంభమయ్యాయి. మానవ వనరుల స్థాయీ సంఘం సమావేశమై విద్యా పద్దతులపై సమీక్ష చేపట్టింది. బడ్జెట్‌ పద్దతులపై సమీక్ష నిమిత్తం 12 స్థాయీ సంఘాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.