Thursday, 5 November 2026

తెలంగాణ

‘అమ్మహస్తం’ ఇబ్బందులపై టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు

హైదరాబాద్‌, జనంసాక్షి : మంత్రులు ఎవరూ తప్పు చేయలేదని తాము నమ్ముతున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంత్రివర్గం రాజకీయపరమైన ఆరోపణలు తగవన్నారు. ‘అమ్మహస్తం’లో ఇబ్బందులపై వినియోగదారులు టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు.

దళిత క్రైస్తవుల హక్కులను పరిరక్షించాలంటూ డిమాండ్‌

సికింద్రాబాద్‌, జనంసాక్షి: దళిత, క్రైస్తవ రాజ్యాధికార రాష్ట్ర సదస్సు శుక్రవారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు, వివిధ చర్చిల ప్రతినిధులు పాల్గొన్నారు. కాన్సీరాం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు రావిల…

టిఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో సమావేశం

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆ పార్టీ పోలిట్‌ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఎన్నికల కమిటీల ఏర్పాట్లపై చర్చినున్నారు. ఈ సమావేశానికి పార్టీ ముఖ్యలు హాజరయ్యారు.…

మైనారిటీ మంత్రం

జగన్‌ ప్రభావం తగ్గించేందుకు కాంగ్రెస్‌ యాక్షన్‌ ప్లాన్‌ రాష్ట్రానికి ముస్లిం, క్రైస్తవ మత ప్రముఖులు రాక? మైనారిటీలకు కాంగ్రెస్‌ ఒక్కటే రక్షణ ఇస్తుందన్న వాదన జగన్‌ ఓటేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందన్న వాదన ఇప్పటికే అనిల్‌కు కౌంటర్‌ ఇస్తున్న…

పెన్షన్‌ పెంచేందుకు పోరాటం; మంద కృష్ణ

హైదరాబాద్‌; వితంతువులకు , వృద్ధులకు పెన్షన్‌ పెంచేందుకు పోరాటం కొనసాగిస్తామని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష్యుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా పెద్దెముల్‌ గ్రామ పంచాయితిలో వితంతువులు , వృద్ధుల పెంన్షన్ల సాధన కోసం జరిగిన సభకు…

జగన్‌కు కలిసిన ఎమ్మెల్యే కృష్ణదాస్‌

హైదరాబాద్‌; చంచల్‌గూడ జైలులో వైఎస్‌ఆర్‌ కాంగ్రేస్‌ పార్టీ అధ్యక్ష్యుడు,ఎంపి జగన్మోహన్‌ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ ఈ రోజు కలిసారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ పరిస్థితిని జగన్మోహన్‌ రెడ్డి ధర్మానను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా…

ప్రజలతో స్నేహంగా మెలిగేందుకే డయల్‌ 100: డీజీపీ

హైదరాబాద్‌, జనంసాక్షి : పోలీసులు, ప్రజల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తున్నామని డీజీపీ దినేశ్‌రెడ్డి చెప్పారు. డీజీపీ కార్యాలయంలో దినేశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలతో మరింత స్నేహంగా మెలిగేందుకే ‘డయల్‌ 100’ ప్రారంభించామని వెల్లడించారు. సాయం…

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

బోనకల్‌, జనంసాక్షి : ఖమ్మం బోనకల్‌ మండలంలోని రావినూతల గ్రామంలో తాళ్లూరి రామకృష్ట అనే రైతు నుంచి ట్రాన్స్‌కో ఏఈ పాషా రూ. 30వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు పాషాను అదుపులోకి తీసుకున్నారు.

పబ్బులపై హెచ్‌ఆర్సీలో పిటిషన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి : నగరంలో పబ్‌లు యువతను పెడదారి పట్టిస్తున్నాయంటూ మానవహక్కుల కమిషన్లో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ ఈ నెల 17లోగా పబ్‌ లపై నివేదిక ఇవ్వాలని హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసు కమిషనరను ఆదేశించింది.