సీమాంధ్ర

ప్రజల నడ్డివిరిచేలా భారాలు మోపడం తగదు

కేంద్రానికి వంత పాడుతున్న వైసిపి ప్లీనరీలో ఎందుకు సమస్యలపై చర్చించరు వైసిపి తీరుపై మండిపడ్డ సిపిఎం నేతలు అమరావతి,జూలై9( జనంసాక్షి ):గత ఐదారు మాసాల్లోనే ప్రజలపై నడ్డివిరిచే భారాలు …

అబద్దాలపై నడుస్తున్న వైసిపి ప్రభుత్వం

మూడేళ్లలో ఏ హావిూని సక్రమంగా నెరవేర్చని జగన్‌ మండిపడ్డ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అమరావతి,జూలై8( జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అబద్దాల ప్రచారంపై నడుస్తుందని జనసేన అధ్యక్షుడు …

ఇడుపులపాయలో వైఎస్‌కు ఘనంగా నివాళి

నివాళి అర్పించిన వైఎస్‌ కుటుంబ సభ్యులు తండ్రిని తలుచుకుంటూ జగగన్‌ భావోద్వేగ ట్వీట్‌ కడప,జూలై8 (జనం సాక్షి): మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా …

వైఎస్‌ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం

ఆర్బీకెల ద్వారా పలు కార్యక్రమాల అమలు అమరావతి,జూలై8(జనం సాక్షి): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని …

గౌరవ అధ్యక్షురాలుగా తప్పుకున్న విజయమ్మ

ప్లీనరీ వేదికగా పార్టీ పదవికి రాజీనామా ప్రకటన ఎపిలో జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారని వెల్లడి తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తన రాజీనామాపై …

పదవి అంటే అధికారం కాదు.. ప్రజల విూద మమకారం మాత్రమే మూడేళ్ల పాలనలో తాము అదే నిరూపించాం ప్రజలకు పాలనను చేరువ చేసి చూపాం సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి గడపను తట్టాం మన మేనిఫెస్టోనుచూస్తేనే భయపడే స్థితిలో టిడిపి పావురాలగుట్టలో మొదలైన సంఘర్షణతో నా వెన్నంటి నడిచారు మన విజయాన్ని గజదొంగల పార్టీవారు ఆపలేరు వైసిపి ప్లీనరీలో సిఎం జగన్‌ ఉత్సాహపూరిత ప్రసంగం గుంటూరు,జూలై8(ఆర్‌ఎన్‌ఎ): పదవి అంటే అధికారం కాదు.. ప్రజల విూద మమకారం అని నిరూపించామని సిఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ మూడేళ్లలో ప్రజల సేవకు అంకితం అయ్యామని అన్నారు. ఇచ్చిన హావిూని నిలబెట్టుకునేందుకు ప్రతిక్షణం తపనపడ్డామని అన్నారు. అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో హావిూలు ఇచ్చి మాయం చేసే పార్టీలను చూశాం. ప్రజలు నిలదీస్తారేమో నని టీడీపీ మేనిఫెస్టోని మాయం చేసింది. ఆ పరిస్థితి నుంచి మేనిఫెస్టో అంటే అమలు చేసే ప్రతిజ్ఞగా చూపించాం. మన మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టి 95 శాతం హావిూలు అమలు చేశాం. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను చూడటానికే టీడీపీ భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 2009, సెప్టెంబర్‌ 25న పావురాలగుట్టలో సంఘర్షణ మొదలైంది. ఓదార్పు యాత్రతో పార్టీ ఒక రూపం దాల్చింది. వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందన్నారు. నన్ను ప్రేమించి, నాతో వెన్నుదన్నుగా నిలబడ్డ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్‌ చేస్తున్నా. ఈ 13ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. నాన్న నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం నా చేయి ఎప్పుడూ వదల్లేదు. ప్రజలు మూడేళ్ల కిందట కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు దేవుడు పరిమితం చేశాడని టిడిపిని ఉద్దేశించి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైఎస్సార్‌సీపీ అని గర్వంగా చెప్తున్నానని జగన్‌ అన్నారు.. ఈ మూడేళ్ల ప్రయాణం ఎన్నో పోరాటాల ప్రస్థానం. రైతులపై మమకారం అంటే ఇలా ఉంటుందని నిరూపించింది మన పాలన. మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. ఎన్నికుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు.. సంకల్పం మారలేదు. నాకు ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడు నా చేయి వీడలేదు. మన పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయింది. కాబట్టి గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు అని సీఎం జగన్‌ అన్నారు. దుష్టచతుష్టయం మన పాలనలో మంచి ని ఓర్వలేక అబద్దాల విషప్రచారం చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇవాళ నోరు పారేసుకుంటున్నారు. ఆ కట్టుకథల్ని, వాటికి అబద్దాలు జోడిరచి ఎల్లోవిూడియా ప్రచారం చేస్తోంది. గతంలో రాష్టాన్న్రి దోచుకో పంచుకో అన్నట్లుగా గజదొంగల ముఠా వ్యవహరించింది. ఇప్పుడు అవకాశం లేక కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ జనం వెంట, జనం గుండెల్లో ఉంది. గజదొంగల ముఠా మాత్రం, ఎల్లో విూడియా, ఎల్లో సోషల్‌ విూడియాలో మాత్రమే ఉంది. వాళ్లకు, మనకు ఎక్కడా పోలిక లేదు. మనది చేతల పాలన.. వాళ్లది అబద్ధపు విష ప్రచారం అని సీఎం జగన్‌ అన్నారు. మేనిఫెస్టోలను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించి పాలన చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో మార్పును తీసుకువచ్చిన పార్టీ వైసీపీ అని అన్నారు. వివక్ష, కరప్షన్‌ లేకుండా పారదర్శక పాలన అందిస్తు న్నామని చెప్పుకొచ్చారు. పరిపాలన సంస్కరణలను చేసి చూపిన పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు.అన్ని రంగాల్లోనూ సంస్కరణలు తీసుకువచ్చామని, ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చామన్నారు. కరోనా తీవ్రతలోనూ ఆర్థికంగా దెబ్బతినకుండా చూశామని అన్నారు. గత ప్రభుత్వ బకాయిలను కూడా తాము చెల్లించామని తెలిపారు. లంచాలు, అవినీతికి తావులేకుండా పాలన అందిస్తున్నామన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్నా కొందరు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు కలిసి దుష్పచ్రారం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హావిూల్లో 95 శాతం అమలు చేశామని అన్నారు. మన గెలుపు ఆపడం ఈ గజదొంగల తరం కాదు అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. జగన్‌ ప్రసంగానికి కార్యకర్తల నుంచి స్పందన భారీగా వచ్చింది. చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు.

పదవి అంటే అధికారం కాదు..   ప్రజల విూద మమకారం మాత్రమే మూడేళ్ల పాలనలో తాము అదే నిరూపించాం ప్రజలకు పాలనను చేరువ చేసి చూపాం సంక్షేమ …

ఘనంగా వైసిపి ప్లీనరీ నిర్వహణ

రాబోయే ఎన్నికలకు మరింత పటిష్టంగా ముందుకు ప్లీనరీ తరవాత చంద్రబాబు ఏడ్వడం ఖాయం: విజయసాయి అమరావతి,జూలై7(జనంసాక్షి)):వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ ప్లీనరీని అత్యంత ప్రతిష్టాత్మకంగా …

రెండోరోజూ కొనసాగిన బాబు పర్యటన

చిత్తూరు,జూలై7(జనంసాక్షి):ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు గురువారం పర్యటన కొనసాగుతోంది. నగిరి ప్లలెలో నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఇంటికి …

పెగాసస్‌పై అనవసర రాద్దాంతం

అభద్రతా భావంతో ఉన్న ప్రభుత్వం మండిపడ్డ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అమరావతి,జూలై7(జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెగాసెస్‌ ఇక్యూప్‌మెంట్‌ కొన్నారని అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని …

ద్రోహంచేసిన బిజెపితో అంటకాగుతారా

వైసిపి ప్రభుత్వంపై శైలజానాథ్‌ మండిపాటు విజయవాడ,జూలై7(జనంసాక్షి)): రాష్టాన్రికి ద్రోహం చేసిన బీజేపీకి సీఎం జగన్‌ మద్దతు ఇస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్‌ మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన …