Thursday, 5 November 2026

May 2013

జాతీయం

బన్సల్‌,అశ్వనీకుమార్‌ రాజీనామాలను ఆమోదించిన ప్రణబ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులు పవన్‌కుమార్‌ బన్సల్‌, ఆశ్వనీకుమార్‌ రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించారు. మంత్రులిద్దరు తమ పదవులకు శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ

మహాసేన్‌ తుపాను

ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక హైదరాబాద్‌ : రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లోనూ ఈరోజు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారిన నేపథ్యంలో దీనికి మహాసేన్‌ తుపానుగా నామకరణం చేశారు.…

తెలంగాణ

రాష్ట్రంలో భానుడి భగభగ

హైదరాబాద్‌, జనంసాక్షి: భానుడి ప్రతాపానికి రాష్ట్రం ఎండలో మండిపోతోంది. ఖమ్మం జిల్లా మణుగూరు ఓపేన్‌ కాస్ట్‌లో ఇవాళ అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వరంగల్‌, రామగుండంలో అత్యదికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామ 44.5 రెంటచింతల,…

జాతీయం

కపిల్‌ సిబల్‌కు న్యాయశాఖ, జోషీకి రైల్వే శాఖ

న్యూఢిల్లీ : రైల్వేశాఖ, న్యాయశాఖల మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయాశాఖల బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కపిల్‌సిబల్‌కు న్యాయశాఖ, సీపీ జోషికి రైల్వే శాఖలను కేటాయించారు.

సీమాంధ్ర

దుగరాజపట్నం పోర్టుతో పదిలక్షల మందికి ఉపాధి

ఎంపీ చింతామోహన్‌ గూడూరు, నెల్లూరు జిల్లా : త్వరలో ఏర్పాటుకానున్న దుగరాజపట్నం పోర్టుతో రాష్ట్రంలోని పదిలక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ చింతామోహన్‌ అన్నారు. 25 లక్షల కోట్లతో 500 భారీ పరిశ్రమలు రానున్నట్లు ఆయన…

సీమాంధ్ర

నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేస్తే గౌరవంగా ఉండేది

భజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు గాంధీనగర్‌ (కాకినాడ) : అప్రతిష్ఠ మూటగట్టుకున్న తరువాత కేంద్ర మంత్రి పదవులకు పవన్‌కుమార్‌ బన్సల్‌, అశ్వనీకుమార్‌లు రాజీనామా చేశారని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. అరోపణలు వచ్చిన వెంటనే నైతిక విలువలకు…

తెలంగాణ

నగలకోసం మహిళ హత్య

వరంగల్‌, జనంసాక్షి: వర్ధన్నపేట మండలం బండౌతపురంలో కొందరు దుండగులు నగల కోసం ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. దుండగులు బంగారు, వెండి ఆభరణాలు అపహరించి, ఆమెను హత్య చేసి పారిపోయారు.

తెలంగాణ

మ్యాన్‌హోల్‌తో ఇద్దరు కార్మికుత గల్లంతు

హైదరాబాద్‌, జనంసాక్షి: మాదాపూర్‌లోని మ్యాన్‌హోల్‌ దిగిన ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతయిన కార్మికుల ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయం

ఎవరిని రక్షించడానికి అశ్వనీకుమార్‌ రాజీనామా చేశారు?

భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ న్యూఢిల్లీ : యూపీఏ-2 కుంభకోణాల నిలయంగా మారిందని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు. అవినీతిని నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎవరిని రక్షించడానికి అశ్వనీ కుమార్‌ రాజీనామా చేశారని ప్రశ్నించారు.…

అంతర్జాతీయం

పాకిస్థాన్‌లో పలు చోట్ల బాంబు పేలుళ్లు ..పదిమంది మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ముష్కరులు బాంబు పేలుళ్లతో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. కరీచీ , క్వెట్టా, పెషావర్‌ ప్రాంతాల్లో చోటుచేసుకున్న నాలుగు పేలుళ్లలో 10 మంది మృతి చెందగా.. 40 మందికిపైగా గాయపడ్డారు.…