Thursday, 5 November 2026

May 2013

తెలంగాణ

హైదరాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : కలెక్టరేట్‌ ఎదుట తెరాస ఆందోళన చేపట్టింది. బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలించొద్దంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

సీమాంధ్ర

ఉచిత, సత్వర న్యాయం అందించేందుకు లోక్‌ అదాలత్‌లు చక్కని వేదికలు

-జస్టిన్‌ ఎన్వీ రమణ విజయవాడ : ఉచిత, సత్వర న్యాయం అందించేందుకు లోక్‌ అదాలత్‌లు చక్కని వేదికలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలో మెగా లోక్‌ అదాలత్‌లను ఆయన ప్రారంభించారు. ఉచితంగా…

తెలంగాణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్తంభించేలా చలో అసెంబ్లీ : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : 2014 ఎన్నికల్లోపే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. ఐకాస చేపడుతున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్తంభించేలా ఈ…

తెలంగాణ

తెలంగాణ బిల్లు లక్ష్యంగా చలో అసెంబ్లీ : కోదండరామ్‌

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యాచరణను ఈ మధ్యాహ్నం ప్రకటిస్తామని ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు లక్ష్యంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. చలో అసెంబ్లీకి తెసెంబ్లీకి తెరాస, సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించాయని…

ఎడిట్ పేజీ

కార్మికుల ప్రాణాలకు భద్రతేది?

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో గత నెల బహుళ అంతస్తుల భవనం కుప్పకూలి ఎనిమిది వందల మందికి పైగా కార్మికులు దుర్మరణం చెందారు. ప్రపంచంలోనే అత్యంత బీద దేశాల్లో బంగ్లాదేశ్‌ ఒకటి. ఇక్కడ పనిచేసే కూలీలు, కార్మికులకు చెల్లించేది అత్యల్ప…

తెలంగాణ

రాష్ట్రానికి అదనంగా వెయ్యి మెడికల్‌ సీట్లు వచ్చే అవకాశం

-మంత్రి కొండ్రు హైదరాబాద్‌ : ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా వెయ్యి మెడికల్‌ సీట్లు వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఎంసెట్‌ వ్యవసాయ, వైద్య విద్య పరీక్ష ప్రశ్నాపత్రం కోడ్‌ను ఆయన విడుదల చేసి…

తెలంగాణ

‘ఎస్‌’సెట్‌ కోడ్‌ ప్రశ్నాపత్రం ఎంపిక

హైదరాబాద్‌ : ఎంసెట్‌ వ్యవసాయ, వైద్య విద్య పరీక్ష ప్రశ్నాపత్రం కోడ్‌ను మంత్రి కొండ్రు మురళి విడుదల చేశారు. కూకట్‌పల్లి జేఎస్‌టీయులో ఆయన అధికారులతో కలిసి ‘ఎస్‌’ సెట్‌ కోడ్‌ను విడుదల చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి…

తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థుల మృతి

డిచ్‌పల్లి : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి పరిధిలోని సీఎంసీ అసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు మృతి చెందారు. ఎస్సై నరేశ్‌ తెలిపిర వివరాల ప్రకారం…

సీమాంధ్ర

ఎంసెట్‌ విద్యార్థుల పట్ల రైల్వేపోలీసుల దురుసు ప్రవర్తన

చిత్తూరు : జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో ఎంసెట్‌ విద్యార్థుల పట్ల రైల్వే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రాత్రి వేళ రైల్వేస్టేషన్‌లో విద్యార్థులు ఉండటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత…

తెలంగాణ

ప్రారంభమైన ఎంసెట్‌ పరీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. ఇంజినీరింగ్‌ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 534 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 45 నిమిషాల ముందుగానే విద్యార్థులను పరీక్షి కేంద్రాల్లోకి అనుమతించారు.