Wednesday, 4 November 2026

May 2013

Featured News

భానుడి ప్రచండం నిప్పుల కొలిమిగా రాష్ట్రం

పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు ఒక్కరోజే 23 మంది మృతి హైదరాబాద్‌, మే 23 (జనంసాక్షి) : భానుడు ప్రచండరూపం దాల్చాడు. ఆయన ఉగ్రరూపం ధాటికి గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 23 మంది మృత్యువాతపడ్డారు. మండుతున్న ఎండలతో రాష్ట్రం నిప్పులకొలిమిలా…

Featured News

లిడియా డేవిన్‌కు బుకర్‌ ప్రైజ్‌

లండన్‌, (జనంసాక్షి) : అమెరికన్‌ రచయిత్రి లిడియా డేవిన్‌ ఈ ఏడాది మాన్‌ బుకర్‌ అంతర్జాతీయ బహుమతికి ఎంపికయ్యారు. లండన్‌లోని విక్టోరియా అండ్‌ అల్బర్ట్‌ మ్యూజియంలో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో డేవిన్‌ బుకర్‌ప్రైజ్‌ అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ…

Featured News

మంత్రుల కమిటీ తొలిభేటీ

సీబీఐ స్వయం ప్రతిపత్తిపై చర్చ న్యూఢిల్లీ, మే 23 (జనంసాక్షి) : సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై కేంద్ర మంత్రివర్గ ఉప సంఘం గురువారం సాయంత్రం భేటీ అయింది. ఈ భేటీలో…

Featured News

రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందింది

హిందూ మహాసముద్ర తీరంలో అప్రమత్తత అవసరం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గుర్గావ్‌, మే 23 (జనంసాక్షి) : భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యం ద్విగుణీకృతమైందని, భద్రతను అత్యంత పటిష్టం చేసుకుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత రక్షణ సహకార వ్యవస్థ…

Featured News

అమ్మహస్తంపై దుష్ప్రచారం వద్దు

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, మే 23 (జనంసాక్షి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అమ్మహస్తం’పై వస్తున్న విమర్శలను పౌరసరఫరాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధంబాబు ఖండించారు. రాజకీయ దురుద్దేశంతోనే అమ్మహస్తం పథకంపై దుష్పచ్రారం చేస్తున్నారని అన్నారు. అమ్మహస్తం పథకంలో చిన్నచిన్న…

Cover Story

‘కాగ్‌’గా శశికాంత్‌ నియామకం

సుప్రీంలో అభ్యంతరం న్యూఢిల్లీ, మే 23 (జనంసాక్షి) : కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)గా శశికాంత్‌శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.…

తెలంగాణ

బాన్పువాడలో రేపు టీఆర్‌ఎస్‌ శిక్షణా శిబిరం

నిజామాబాద్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలో కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమంలో నిర్వహించనుంది. రేపు బాన్పువాడలో టీఆర్‌ఎస్‌ శిక్షణా శిబిరాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. రాబోయే ఎన్నికలకు పార్టీని ఎలా సన్నద్ధం చేయాలో, ప్రజలను ఎలా చైతన్య…

తెలంగాణ

24న సమావేశం కానున్న స్టీరింగ్‌ కమిటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 24 న ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఛలో అసెంబ్లీ, బయ్యారం బస్సు యాత్రపై చర్చించనున్నట్లు సమాచారం.

జాతీయం

శ్రీనివాస్‌లో అల్లుడి ఇంట్లో సోదాలు

చెన్నై , జనంసాక్షి: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాస్‌ అల్లుడు, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు సీఈవో అయిన గునాథ్‌ మీయప్పన్‌ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు.స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా మీయప్పన్‌ను విచారించచడానికి ముంబయి పోలీసులు ఈరోజు ఉదయం…

తెలంగాణ

రాష్ట్రమంతటా 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. రెంటచింతలలోగురువారం అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదు కాగా, రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో 44 డిగ్రీల ఉషోగ్రతలు నమోదయ్యాయి,