Thursday, 5 November 2026

June 2013

జాతీయం

పార్టీ పదవులకు రాజీనామా చేసిన అద్వానీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భారతీయ జనతా పార్టీలో సంక్షోభం ముదిరినట్లే కనిపిస్తుంది. పార్టీ పదవులకు ఆ పార్టీ అగ్రనేత ఎల్‌ కే అద్వానీ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. గోవాలో జరిగిన భాజపా…

తెలంగాణ

సరస్వతి పుష్కరాల్లో అపశృతి

కరీంనగర్‌, (జనంసాక్షి): పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో అపశృతి చోటుచేసుకుంది. పుణ్య స్నానాలకని పుష్కరాలకు వచ్చిన ఓ సీమాంధ్ర వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. విజయవాడకు చెందిన ఉమామహేశ్వరరావు అనే భక్తుడు పుష్కరాల్లో మృతి చెందాడు.

తెలంగాణ

టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం : శంకర్రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని మాజీ మంత్రి శంకర్రావు జోష్యం చెప్పారు. ఇవాళ ఆయన అసెంబ్లీ లాయీల్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సరే సీమాంధ్రలో వైఎస్సార్సీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీలు ఘన…

జాతీయం

అద్వానీతో రాజ్‌నాథ్‌సింగ్‌ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ రోజు ఆ పార్టీ అగ్రనేత ఆద్వానీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. గోవాలో జరిగిన పార్టీ సమావేశాలకు అనారోగ్య కారణాలవల్ల అద్వానీ హాజరవలేదు. అద్వానీ అభ్యంతరాలను పక్కనపెట్టి ఈ సమావేశాల్లో మోడీని…

జాతీయం

బీసీసీఐ నూతన కార్యదర్శిగా సంజయ్‌ పాటిల్‌

ఢిల్లీ,(జనంసాక్షి): బీసీసీఐ నూతన కార్యదర్శిగా సంజయ్‌ పాటిల్‌ ఎన్నికయ్యారు. కోశాధికారిగా రవి సావంత్‌ ఎన్నికయ్యారు. రవిసావంత్‌ ఇప్పటివరకు ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ

కేటీపీఎన్‌ తొమ్మిదో యూనిట్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం, (జనంసాక్షి): కేటీపీఎన్‌లోని తొమ్మిదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్తత్తు చర్యలు చేపట్టారు.

జాతీయం

రాజ్‌కుంద్రాను సస్పెండ్‌ చేసిన బీసీసీఐ

న్యూఢిల్లీ, (జనంసాక్షి): బెట్టింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్‌ రాయల్స్‌ సహయ.మాని రాజ్‌కుంద్రా వేటు పడింది. కుంద్రాను బీసీసీఐ సస్పెండ్‌ చేసింది. ఈ రోజు అత్యవసరంగా సమావేశమైన బీసీసీఐ వర్కింగ్‌ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తు పూర్తయ్యేవరకు ఈ…

కరీంనగర్

రేణుకా చౌదరిని విమర్శించిన టీఆర్‌ఎస్‌ నేత వివేక్‌

కరీంనగర్‌,(జనంసాక్షి): ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పచ్చి తెలంగాణ ద్రోహి అని టీఆర్‌ఎస్‌ నేత, ఎంపీ వివేక్‌ విమర్శించారు. ఆమె పదవుల కోసం పాకులాడే వ్యక్తి అని దుయ్యబట్టారు. శ్రీకృష్ణ కమిటీ ఎనిమిదవ చాప్టర్‌క్ష్మీ అమల్లో భాగంగానే…

తెలంగాణ

9 రోజులపాటు శాసనసభ సమావేశాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం ముగిసింది. 9 రోజులుపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 వరకు సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు శాసనసభ సమావేశాలను మరో 10 రోజులు…

తెలంగాణ

ఈయూ, టీఎంయూ నేతలతో ఆర్టీసీ యాజమాన్యం చర్చలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మె నివారణ కోసం సంస్థ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. గుర్తింపు సంఘం ఎంప్లాయిస్‌ యూనియన్‌, టీఎంయూ నేతలతో బస్‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్చలు చేపట్టారు. ఆర్టీసీలో కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని,…