Tuesday, 3 November 2026

June 2013

తెలంగాణ

మంత్రి పదవి అనేది భిక్షం కాదు: కేకే

హైదరాబాద్‌ : మంత్రి పదవి అనేది భిక్షం కాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు కేకే అన్నారు. మంత్రులను ఎప్పుడంటే అప్పుడు తొలగించడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. నేడు నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో…

సీమాంధ్ర

రాష్ట్రంలో కొన్ని చోట్ల వానలు కురిసే అవకాశం

విశాఖ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు సాయంత్రానికి క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో కొన్ని చోట్ల వానలు కురిసే…

తెలంగాణ

చిట్టీల పేరుతో రూ. కోటి వసూలు చేసి వ్యాపారి పరారీ

ఖమ్మం : మామిళ్లగూడెంలో చిట్టీల పేరుతో శేషగిరి అనే వ్యాపారి రూ. కోటి వసూలు చేసి పరారాయ్యాడు. దీంతో బాధితులు వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని…

తెలంగాణ

గోవుల తరలింపును అడ్డుకున్న వీహెచ్‌పీ కార్యకర్తలు

హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లా సిద్దిపేట నుంచి హైదరాబాద్‌లోని ఎర్రగడ్డకు 30 ఆవులు, లేగ దూడలను డీసీఎంలో తరలిస్తుండగా విశ్వహిందూ పరిషత్‌, గోసంరక్షణ  సమితి సభ్యులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. జంతు హింస చట్టం కింద పోలీసులు కేసు…

తెలంగాణ

పెళ్లి ఇంట్లో చోరీ

హైదరాబాద్‌ : మౌలాలీలోని గోపాల్‌నగర్‌లో ఓ పెళ్లి ఇంట్లో చోరీ జరిగింది. 12 తులాల బంగారం, రూ. 1.50 లక్షల నగదు, పెళ్లి బట్టలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…

సీమాంధ్ర

డీఎల్‌ బర్తరఫ్‌కు నిరసనగా ఖాజీపేటలో ఆందోళన

కడప : మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి బర్తరఫ్‌కు నిరసనగా కడప జిల్లా ఖాజీపేటలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కడప`కర్నూలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. డీఎల్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారనే కారణంతో ఓ మహిళ కిరోసిన్‌…

తెలంగాణ

ఎంజీఎం ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

వరంగల్‌ : ఎంజీఎం ఆసుపత్రిలోని మెడికల్‌ రెండో విభాగంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌సర్య్కూట్‌తో మంటలు చెలరేగాయి. వెంటేనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

సీమాంధ్ర

రూ. కోటి విలువైన గంజాయి పట్టుకున్న పోలీసులు

విశాఖ : నర్సీపట్నం సమీపంలో వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ. కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. 8 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

వరంగల్‌ జిల్లా : హసన్‌పర్తి వద్ద ఈ ఉదయం ద్విచక్రవాహనాన్ని ఆటో ట్రాలీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ

కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ చెరువులో అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని రెవెన్యూ సిబ్బంది ఈ ఉదయం చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రత మధ్య అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.