Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

ప్రారంభమైన కౌంటింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సంబంధించి కౌంటింగ్‌ మధ్యాహ్నం రెండుగంటలకు మొదలైంది. మొదట వార్డు మెంబర్ల ఓట్లను లెక్కిస్తారు. అనంతరం సర్పంచ్‌ ఓట్లను లెక్కించి సాయంత్రానికల్లా ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు.

సీమాంధ్ర

భోజనాలు రాలేదని నిలిపివేసిన ఓట్ల లెక్కింపు

అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లాలోని బెళగుప్పలో భోజనాలు రాలేదని ఎన్నికల సిబ్బంది మధ్యాహ్నం రెండున్నర అవుతున్నా ఓట్ల లెక్కింపు ప్రారంభించలేదు. రెండు గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కావలసి ఉంది.

తెలంగాణ

ప్రారంభమైన రెండో విడత ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌: ఈ రోజు ఉదయం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. రెండో విడతలో 916 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి అనంతరం సర్పంచ్‌ ఓట్ల…

జాతీయం

తండ్రి చేతిలో ప్రాణాలుకోల్పయిన 8ఏళ్ల బాలిక

బెంగళూరు: ఎనిమిదేళ్ల చిన్నారిని పట్టుకుని సరిగా చదవడం లేదని ప్రాణం పోయేలాకొట్టాడో తండ్రి. కన్నతండ్రి చేతుల్లోనే బిడ్డ ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోగా ఇప్పుడా తండ్రి జైలులో వూచలు లెక్కబెడుతున్నాడు. పాప అతని మొదటి భార్య కుమార్తె అని, భార్య…

తెలంగాణ

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే హరీష్‌రావు

సంగారెడ్డి అర్బన్‌: మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని హసన్వాది, కంది, ఇస్మాయిల్‌ఖాన్‌పేట్‌, తదితర గ్రామాల్లో పర్యటించారు. తెలంగాణకు అడ్డుపడుతున్న తెదేపా , కాంగ్రెస్‌లను ఓడించాలని ఓటర్లను కోరారు.

జాతీయం

ఆగష్టు 1న లేదా 2న సీడబ్ల్యూసీ భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ అంశంను తేల్చేందుకు ఆగష్టు 1న లేదా 2న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. సీమాంధ్ర నేతలు తెలంగాణ అడ్డుకునే విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరిప్రయత్నంగా సీమాంధ్రమంత్రులు ప్రధానిని కలిసి విభజన…

సీమాంధ్ర

దేవినేని ఉమను అదుపులోకి తీసుకున్న పోలీసులు

విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం మూలపాడులో తెదేపా కార్యకర్తలకు మద్దతుగా పోలింగ్‌ కేంద్రం వద్ద ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూలపాడులో ఓకే ఇంటి చిరునామాతో ఉన్న 250 ఓట్లను తొలగించి…

జాతీయం

పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన

పూంఛ్‌,(జనంసాక్షి): జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద పాకిస్థాన్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఏడున్నర గంటలనుంచి  సరిహద్దులోని రెండు భారతీయ సైనిక శిబిరాలపై పాకిస్థాన్‌ సైన్యం…

తెలంగాణ

ముగిసిన రెండో విడత పంచాయతీ పోలింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. పలు ప్రాంతాల్లో ఓటు వేసేందుకు జనం వరుసలో వేచివున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట…

తెలంగాణ

ఓయూలో విద్యార్థుల బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాయల తెలంగాణ వద్దు.. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలని డిమాండ్‌ చేస్తూ ఓయూలో విద్యార్థులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి ఎన్‌సీసీ గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. ఎన్‌సీసీ గేటు వద్ద…