Wednesday, 4 November 2026

July 2013

జాతీయం

వార్‌రూమ్‌ భేటీ ప్రారంభం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాలపై హస్తినాలో వాడీవేడి చర్చ జరుగుతుంది. ఓ పక్క సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతుంటే, మరో పక్క తెలంగాణపై తేల్చాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో రాష్ట్రానికి చెందిన…

తెలంగాణ

ఆందోళన చేపట్టిన తెలంగాణ వాదులు

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని వైకాపా కార్యాలయం ఎదుట తెలంగాణ వాదులు ఆందోళనకు దిగారు. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు నిరసనకారులు యత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ

నిపుణుల కమిటీకి గ్రూప్‌-1 నాలుగు ప్రశ్నలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): 2011 గ్రూప్‌-1 పరీక్షలో వివాదస్పదమైన నాలుగు ప్రశ్నలను నిపుణుల కమిటీకి పంపాలని ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిపుణుల కమిటీ నివేదికను నాలుగు వారాల్లో సమర్పించాలని ఏపీపీఎస్సీకిహైకోర్టు సూచించింది.

తెలంగాణ

ప్రమాదవశాత్తూ వ్యాను బోల్తా: ఒకరి మృతి

హైదరాబాద్‌, అల్వాల్‌: బొల్లారం వద్ద రాజీవ్‌ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. మెదక్‌ జిల్లా దౌలతాబాద్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బాలిరెడ్డి తన కూతురు కీర్తన నగరంలో గుండెజబ్బుతో మృతి చెందడంతో…

జాతీయం

అధిష్ఠాన పెద్దలతో భేటీ కానున్న త్రిమూర్తులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంఎస్‌ అధిష్ఠాన పెద్దలతో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌లు భేటీ కానున్నారు. ఈ సమావేశం కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో జరగనుంది. సమావేశానికి షిండే, చిదంబరం, ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌, ఏకే ఆంటోని, దిగ్విజయ్‌సింగ్‌ హాజరుకానున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఈ…

జాతీయం

వీర జవాన్లకు భారత్‌ ఘన నివాళులు

ఢిల్లీ: కార్గిల్‌ యుద్ధంలో మరణించిన వీర జవాన్లకు భారత్‌ ఘన నివాళులర్పించింది. ఢిల్లీలోని అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రి ఏకే ఆంటోని, తివిధ దళాధిపతులు పాల్గొని వీర జవాన్లకు నివాళులర్పించారు.

తెలంగాణ

విద్యాదాఘాతంతో రైతు మృతి

జమ్మికుంట గ్రామీణం: జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామానికి చెందిన రైతు శ్రీపతి సంపత్‌(40) ఈ రోజు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పొలంలో మోటారు ఆన్‌ చేసేందుకు వెళ్లిన సంపత్‌ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

జాతీయం

దిగ్విజయ్‌ సింగ్‌ను కలిసిన కేవీపీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు శుక్రవారం న్యూఢిల్లీ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనపై కేంద్ర అధిష్ఠానం నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆ నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.…

జాతీయం

కొద్దిగా కోలుకున్న రూపాయి

ముంబై,(జనంసాక్షి): రూపాయి కొద్దిగా కోలుకుంది. రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యలే ఫలించాయో, మరే కరాణమో గానీ.. 41 పైసలు పైసలు పెరిగి మళ్లీ 58 రూపాయల స్థాయికి వచ్చింది. ఒక అమెరికా డాలర్‌కు 58.70 రూపాయలుగా మారకపు విలువ…

తెలంగాణ

టీ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఉద్యమ భవిష్యత్‌ కార్యచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు.