Wednesday, 4 November 2026

July 2013

జాతీయం

నటి మంజుల అంత్యక్రియలు పూర్తి

చెన్నై,(జనంసాక్షి): నటి మంజుల అంత్యక్రియలు ముగిశాయి. ఈ  మధ్యాహ్నం పోరూర్‌ శశ్మానవాటికలో మంజుల భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె చితికి భర్త విజయ్‌కుమార్‌ నిప్పంటించారు. సినిమా ప్రముఖులు, అభిమానులు అశ్రునయనాలతో ఆమెకు తుది వీడ్కోలు పలికారు. 59 ఏళ్ల…

తెలంగాణ

మాజీ సర్పంచ్‌పై కత్తులతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

వరంగల్‌,(జనంసాక్షి): ఆత్మకూరు మండలంలో మాజీ సర్పంచ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బాధితుడి సరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

అంతర్జాతీయం

ఇరాక్‌లో ఉగ్రవాదుల దాడిలో 9 మంది జవనులు మృతి

బాగ్దాద్‌: ఇరాక్‌లో ఉగ్రవాదుల దాడిలో 9మంది పోలీసులు మృతి చెందారు. మోసుల్‌ అనే పట్టణంలో భద్రతాదళాలకు చెందిన ఒక భవనంపై మిలిటెంట్లు జరిపిన దాడిలో తొమ్మండుగురు పోలీసులు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

తెలంగాణ

ఆన్‌లైన్‌లో ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్న భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. అక్టోబరు 31 లోపు నమోదు చేసుకున్న వారికి డిసెంబరు లోపు ఓటరు కార్డు పంపిణీ చేస్తామని భన్వర్‌లాల్‌ తెలిపారు.

జాతీయం

సహారాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ

ఢిల్లీ,(జనంసాక్షి): సహారాకు చెందిన రెండు సంస్థలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. మదుపుదారలకు డబ్బులు తిరిగి చెల్లించాలన్న ఆదేశాలను పాటించలేదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ

ప్రారంభమైన జాతీయ సెయిలింగ్‌ పోటీలు

హైదరాబాద్‌: నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో 28వ జాతీయ లేజర్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ సెయిలింగ్‌ వీక్‌ పేరుతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 వరకు జరిగే పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ క్లబ్‌ల నుంచి…

తెలంగాణ

పోలీసుల అదుపులో మంత్రి విశ్వరూప్‌ కుమారుడు

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణరెడ్డిపై ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. భూవివాదంలో తనపై దాడి చేశారంటూ రాఘవులు అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూసు పమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయం

2 జీ కేసులో సుప్రీంకోర్టుకు కనిమొళి

ఢిల్లీ: 2 జీ స్పెక్ట్రమ్‌ కేసులో తనపై అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ డీఎంకే ఎంపీ కనిమొళి సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2 జీ కుంభకోణంలో అవినీతికి పాల్పడినట్లు కనిమొళి ఆరోపణలు ఎదుర్కొనడమే కాక అరెస్టై కొంతకాలం జైల్లో ఉన్న…

తెలంగాణ

మంచి నాయకుణ్ణి ఎన్నుకోమని ముందే చెప్పా చంద్రబాబు

హైదరాబాద్‌: తొమ్మిదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, సర్పంచులుగా మంచి నాయకుణ్ణి ఎన్నుకోమని ముందు నుంచే చెప్పానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సహకరించినందుకు…

తెలంగాణ

28న కమ్యూనిస్టు పార్టీల సదస్సు: సీపీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ సాదన కోసం ఈ నెల 28న హైదరాబాద్‌లో ఐదు కమ్యూనిస్టు పార్టీల సదస్సు నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  నారాయణ తెలిపారు. హైదరాబాద్‌ను కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉంచితే మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.