Wednesday, 4 November 2026

July 2013

తెలంగాణ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న :కలెక్టర్‌

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్‌ కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్త సూచించారు. ఎలాంటి…

తెలంగాణ

తెలంగాణపై వెంటనే నిర్ణయం ప్రకటించాలి పొన్నం

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనపై అధిష్ఠానం తప్పక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని అన్నారు.

తెలంగాణ

రెచ్చగొట్టే ప్రయత్నం చేయెద్దు: కోదండరాం

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే సమయంలో సీమాంధ్రనేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. సచివాలయంలో దస్త్రాలు తగలబెడుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు.

సీమాంధ్ర

వరద నీటిలోనే లంక గ్రామాలు

ఐ. పోలవరం: తూర్పు గోదావరి జిల్లాలోని తీరప్రాంత లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే నానుతున్నాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరి ఐదురోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందకపోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తాగునీరు, ఆహారం…

తెలంగాణ

రిటైర్డ్‌ శాస్త్రవేత్త దారణ హత్య

రంగారెడ్డి,(జనంసాక్షి): జిల్లాలోని కీసర మండలం దమ్మాయిగూడలో ఎన్‌ఎఫ్‌సీ రిటైర్డ్‌ శాస్త్రవేత్త రామకృష్ణారావు దారుణ హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీమాంధ్ర

భారీ అగ్ని ప్రమాదం వల్ల 8 ఇళ్లు దగ్ధం

ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ. పోలవరం మండలంలోని మురుమళ్ల గ్రామంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభివించింది. విద్యుదాఘాతం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 8 గృహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. 16 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఆస్తి నష్టం…

సీమాంధ్ర

పోలవరం మండలంలో స్తంభించిన జనజీవనం

పోలవరం: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని 25 గ్రామాలకు గత ఆరు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న సాయంత్రానికి తగ్గుముఖం పట్టిన వరద మళ్లీ ఈరోజు ఉదయం పెరగడంతో ఆయా గ్రామాల…

తెలంగాణ

వింత శిశువు జననం

కాగజ్‌నగర్‌ : ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సునితా ఆసుపత్రిలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. వాంకిడి మండలం ఇంద్రాణి గ్రామానికి చెందని పుష్ప బుధవారం ఉందయం నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, మూడు చెవులు, రెండు…

తెలంగాణ

పాతబస్తీలో డంప్‌ స్వాధీనం

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగర  పోలీసులు పాతబస్తీలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా బుధవారం ఓ డంప్‌ను కనుగొన్నారు. అందులోని 400 జిలెటిన్‌ స్టిక్స్‌తోపాటు 250 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం…