Thursday, 5 November 2026

July 2013

Featured News

వివేక్‌ పాతగూటి పాట

కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : పెద్దపల్లి ఎంపీ జి. వివేక్‌ మళ్లీ పాతగూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరుపుతూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్‌రావుకు షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.…

Cover Story

ప్రశాంతంగా పోలింగ్‌

పార్టీపరం కాకున్నా తమదే ఆధిక్యమంటున్న పార్టీలు తమకు సంబంధం లేదంటున్న అభ్యర్థులు హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : పంచాయతీ తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 82.31 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం…

జాతీయం

ప్రభుత్వాన్ని లెక్కలు తేల్చమన్న కాగ్‌

ఢిల్లీ: ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలో విమానాశ్రయం సహా పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో కాగ్‌ జోక్యం చేసుకుంది. ఢిల్లీలో వరద నివారణ చర్యలకు , మురికినీటి పారుదల వ్యవస్థ మెరుగుపర్చడానికి,…

జాతీయం

మరింత వరద సాయం కోసం కేరళ వినతి

తిరువనంతపురం: వరదల్లో తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని మరింత సహాయం కోరుతూ ఆగస్టు ఒకటిన మరో వినతి పత్రాన్ని సమర్పించనుంది. మంగళవారం ఉదయం రాష్ట్రం మంత్రులతోను, రాష్ట్ర పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చిన కేంద్ర బృందంతోనూ చర్చించిన…

తెలంగాణ

మల్హర్‌లో ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు

కరీంనగర్‌: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్‌ జిల్లా మల్హర్‌ మండలం తాడిచెర్లలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు. ఓట్ల లెక్కింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు.

వార్తలు

ఓ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో చనిపోయిన బల్లి

పాల్వాయ్‌: మధ్యాహ్నం భోజనం ప్రతి చోటా ఏదో ఒక రూపంలో సమస్యలు లేవనెత్తుతోంది. పిల్లల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. తాజాగా హర్యానాలోని పాల్వాయ్‌లో ఓ పాఠశాలలో మధ్యాహ్న  భోజనంలో చచ్చిన బల్లి కన్పించడంతో పిల్లలు తల్లడిల్లి పోయారు. విషయం…

సీమాంధ్ర

పోతిరెడ్డిపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కృష్ణా: కృష్ణాజిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

సీమాంధ్ర

ప్రారంభంకానున్న ఆగస్టు మొదటి వారంలో ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్‌

విశాఖ: విశాఖవాసులను గత రెండేళ్లుగా వూరిస్తున్న ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్‌ను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులను మంత్రి మంగళవారం పర్యవేక్షించారు. ఫ్లైఓవర్‌ నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయని…

తెలంగాణ

ఘనంగా జరుగుతున్న తిలక్‌ జన్మదిన వేడుకలు

హైదరాబాద్‌: స్వాతంత్ర సమరయోధుడు బాల గంగాధర్‌ తిలక్‌ 157వ జయంతిని పలువురు నేతలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కోఠి కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి తెదేపా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో పాటు విశ్వహింద్‌ పరిషత్‌ నేతలు పూలమాల…