Thursday, 5 November 2026

July 2013

సీమాంధ్ర

సమైక్యాంధ్రకు మద్దతుగా బార్‌ అసోసియేషన్‌ విధుల బహిష్కరణ

తిరుపతి: తెలంగాణపై కేంద్ర ఓ నిర్ణయాన్ని వెలువరించనున్న నేపథ్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యమాన్ని ఉద్దృతం చేశారు. తాజాగా సమైక్యాంధ్రకు మద్దతుగా రేపటి నుంచి మూడు రోజులు విధులు బహిష్కరించాలని బార్‌ అసోసియేషన్‌ తిరుపతిలో తీర్మానించింది.

తెలంగాణ

హౌసింగ్‌ బోర్డు ఎస్టేట్‌ ఆఫీసర్‌ ఇంటిపై ఏసీబీ దాడి

హైదరాబాద్‌: నగరంలోని హౌసింగ్‌ బోర్డు ఎస్టేట్‌ ఆఫీసర్‌ జయలక్ష్మి ఇంటిపై అవినీతి నిరోధన శాఖ అధికారులు దాడి చేశారు. జయలక్ష్మి నివాసంలో రూ. 1.50కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించినట్లు సమాచారం.

తెలంగాణ

ఉదయగిరిలో ఇంకా ప్రారంభం కాని ఒట్ల లెక్కింపు

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు. 11వ నెంబరు పోలింగ్‌ కేంద్రంలో మహిళ ఓటు వివాదం కారణంగా లెక్కింపు ప్రారంభం…

తెలంగాణ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ పీఆర్‌టీయూ పోరుబాట

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ పీఆర్‌టీయూ పోరాట బాట పడుతోంది. వచ్చే నెల 7న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల ముందు తొలి దశలో ధర్నా చేపట్టనుంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే రెండో…

తెలంగాణ

ప్రారంభమైన పంచాయతీల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌: తొలి విడత పంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి విడతలో 794 పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్‌ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రంలోగా ఫలితాలు తేలవచ్చని…

తెలంగాణ

యాదగిరిగుట్ట కొనసాగుతున్న పంచాయతీ పోలింగ్‌

నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట పంచాయతీలో పోలింగ్‌ ఇంకా కొనసాగుతోంది. ఓటర్లు గడువులోపు కేంద్రానికి చేరుకోవడంతో అధికారులు ఓటింగ్‌ను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని భువనగిరి మండలం పచ్చర్లబోడు తండాలో అత్యధికంగా 99 శాతం పోలింగ్‌ నమోదైంది.

జాతీయం

బస్సు లోయలో పడటం వల్ల 8 మంది మృతి

మంగళూరు: బస్సు లోయలో పడిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ఘటన మంగళూరులో చోటుచేసుకొంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు మంగళూరులోని సక్లేష్‌పూర్‌ నుంచి హసన్‌ జిల్లా బేలూర్‌కు 50 మంది ప్రయాణికులతో…

సీమాంధ్ర

విశాఖలో 108 సిబ్బంది వినూత్న నిరసన

విశాఖ: కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట 108 సిబ్బంది వినూత్న నిరసన చేపట్టారు. ఏళ్ల తరబడి 108 ద్వారా అత్యవసర సేవలు చేస్తున్న తమను జీవీకే యాజమ్యానం, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని…

తెలంగాణ

బొత్స ప్రకటన హాస్యాస్పదం: యనమల

హైదరాబాద్‌: రాష్ట్రంలో 1038 పంచాయతీలను కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవంగా గెలిచినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స చేసిన ప్రకటన మాజీ ముఖ్యమంత్రి అంజయ్య ప్రకటనను పోలి ఉందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అప్పట్లో 11 ఏళ్లపాటు ఎన్నికలు…

తెలంగాణ

ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: చెదురు మదురు ఘటనలు మినహా తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కడపజిల్లాలో కొన్ని చోట్ల వైకాపా, కాంగ్రెస్‌ వర్గీయుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా వేదాంతపురం పోలింగ్‌ కేంద్రం వద్ద గుర్తుతెలియని…