Tuesday, 3 November 2026

July 2013

తెలంగాణ

ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో కోదండరాం భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదంరాం భేటీ అయ్యారు. సమావేశంలో ఢిల్లీ పరిణామాలు, తాజా రాజకీయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.

జాతీయం

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఖాయం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై అపోహలు వద్దు అని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కల సాకారం కాబోతుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన తెలిపారు.

తెలంగాణ

మధ్యాహ్నం ఢిల్లీకి సీఎస్‌ మహంతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఇవాళ మధ్యాహ్నం హస్తిన వెళ్లనున్నారు. ఇవాళ తెలంగాణపై తుది నిర్ణయం వెలువరిస్తామని కాంగ్రెస్‌ హైకమాండ్‌ చెప్పిన నేపథ్యంలో మహంతి హస్తిన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

అంతర్జాతీయం

స్విట్జర్లాండ్‌లో రెండు రైళ్లు ఢీ: 44 మందికి గాయాలు

స్విట్జర్లాండ్‌: స్పెయిన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనను మరువక ముందే స్విట్జర్లాండ్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. పశ్చిమ స్విట్జర్లాండ్‌లో వాడ్‌ కాన్టన్‌ రాష్ట్రంలో దాదాపు 44 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్సకోసం ఆసుపత్రికి తరలించినట్లు…

తెలంగాణ

హస్తిన బయల్దేరిన సీఎం కిరణ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పిలుపు నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సాయంత్రం సోనియా నివాసంలో జరిగే సీడబ్ల్యూసీ భేటీకి సీఎం హాజరవుతున్నట్లు సమాచారం. ఢిల్లీ బయల్దేరే ముందు క్యాంపు కార్యాలయంలో సీఎంతో మంత్రులు…

జాతీయం

దిగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర నేతల భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దాగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని విభజించొద్దని దిగ్విజయ్‌కు సీమాంధ్ర నేతలు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కనుమూరి బాపారాజు నివాసంలో సీమాంధ్ర నేతలు సమావేశమై రాష్ట్ర విభజనపై చర్చించారు.

తెలంగాణ

ఢిల్లీ బయలుదేరిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అహ్మదుల్లా, బాలరాజు శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లారు.

సీమాంధ్ర

భారీ వర్షం కారణం వల్ల శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతుంది

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు వరదనీరు వచ్చి చేరుతోంది. మధ్యాహ్నం తర్వాత దిగువకు నీరు విడుదల చేసే అవకాశముంది. దీంతో శ్రీశైలం జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణ

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమైన మంత్రులు

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రులు బాలరాజు , అహ్మదుల్లా భేటీ అయ్యారు. కాసేపట్లో ముఖ్యమంత్రి ఢిల్లీ బయలుదేరనున్నారు.

తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేసిన డీజీపీ

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు బలగాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రకాశం జిల్లా దర్శి, కృష్ణా జిల్లా మూలపాడు ఘటనలు పునరావృతం కాకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ కార్యాలయం…