Wednesday, 4 November 2026

October 2015

హైదరాబాద్

సికింద్రాబాద్‌ తిరుమలగిరిలో దారుణం

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. శ్రీనివాస్‌ అనే వ్యక్తిని మరో ఇద్దరు యువకులు కత్తులతో పొడిచి హతమార్చారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీమాంధ్ర

చేపల వేటకెళ్లి మత్స్యకారుడు మృతి

పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కే.ముంజవరం వద్ద గోదావరిలో చేపల వేటకు వెల్లి మత్య్సకారుడు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం… కే ముంజవరం గ్రామానికి చెందిన అచ్చయ్య(50) అనే మత్య్స కారుడు గోదావరిలో చేపలు వేటాడుతుండగా ప్రమాదవశాత్తు…

రంగారెడ్డి

అమ్మవారి ఆలయంలో చోరీ

రంగారెడ్డి : అమ్మవారి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోగల ఓ దేవాలయంలో అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్బంగా హుండీని ఎత్తుకెళ్లారు. అలాగే అమ్మవారి విగ్రహాన్ని ఊరిబయట పడేశారు. ఆదివారం…

హైదరాబాద్

శంషాబాద్ లో బంగారం పట్టివేత

 హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం బంగారాన్ని పట్టుకున్నారు. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మలేషియా నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర 500 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. కాగా… బంగారం…

నల్లగొండ

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా : ఒకరు మృతి

ఆత్మకూరు (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా ఆత్మకూరు-తిమ్మాపూర్ మధ్య జాతీయ రహదారిలో ఆదివారం ఉదయం ఆటో బోల్తా పడి ఒక మహిళ మృతిచెందింది. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వేములకొండకు చెందిన…

మెదక్

పటాన్‌చెరులో ఇద్దరు మంత్రుల పర్యటన

 మెదక్ : జిల్లాలోని పటాన్‌చెరు నియోజకవర్గంలో ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు పర్యటించారు.  వీరితోపాటు పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం…

హైదరాబాద్

ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం బాధాకరం : దత్తాత్రేయ

హైదరాబాద్ : రోజురోజుకూ ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుండడం బాధాకరమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ బాలికల సంరక్షణ దినోత్సవం సందర్భంగా నగరంలోని చార్మినార్‌ నుంచి బేగంపేట వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని…

కరీంనగర్

పత్తిరైతు ఆత్మహత్య

కరీంనగర్ : విద్యుత్ తీగెలు పట్టుకొని ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నాయిని పరుశాం(40) అనే వ్యక్తి తనకుగల నాలుగు ఎకరాల్లో పత్తిని సాగుచేశాడు. పత్తి సాగు…

మహబూబ్ నగర్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

 మహబూబ్‌నగర్‌ : జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మాడుగుల మండలం అన్నెబోయినపల్లి గేట్ దగ్గర డీసీఎం వ్యాన్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను…

హైదరాబాద్

స్నేహితుల మధ్య ఘర్షణ : ఒకరి మృతి

 హైదరాబాద్ : స్నేహితుల మధ్య ఘర్షణ ఒకరి నిండు ప్రాణాల్ని బలిగొంది. క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో గాయాలపాలైన ఒకరు కన్నుమూశారు. హైదరాబాద్ నగరంలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ‌పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది.…