Monday, 9 November 2026

కరీంనగర్

కరీంనగర్ లో సీఐటీయూ నూతన భవనం..

inShare కరీంనగర్ : నేడు జిల్లా కేంద్రంలో సీఐటీయూ నూతన భవనం ప్రారంభం కానుంది. అనంతరం కార్మికుల ప్రదర్శన నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు పద్మనాభన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి సాయిబాబ హాజరు కానున్నారు.

ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తి గట్టయ్య మృతి

కరీంనగర్ : ఆసియాలోనే రెండో పొడవైన వ్యక్తిగా నిలిచిన ‘పొలిపాక గట్టయ్య’ అనారోగ్యంతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందాడు. కరీంనగర్‌నగర్‌ జిల్లా రామగుండం మండలం ఉట్నూర్‌ గ్రామానికి చెందిన పొడగరి గట్టయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గట్టయ్య…

మార్కెట్‌యార్డు సిబ్బందిని లారీతో ఢీకొట్టిన డ్రైవర్

కరీంనగర్ : కరీంనగర్ బైపాస్ రోడ్డులో విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులపైకి లారీ దూసుకెళ్లింది. లారీని ఆపకుండా, అడ్డుకున్న ఇద్దరు ఉద్యోగులపైకి వాహనాన్ని పోనివ్వడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం సుల్తానాబాద్ వైపు నుంచి…

కరీంనగర్‌ జిల్లాలో రైతు ఆత్మహత్య

హైదరాబాద్:: కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హంసలాపూర్‌లో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉరివేసుకుని పత్తి రైతు లాచయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

రైతుపై ఎలుగుబంటి దాడి

కరీంనగర్: పొలం వద్దకు వెళ్తున్న రైతుపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో జరిగిన ఈ దాడిలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

వేధిస్తున్న భర్తను చంపిన భార్య

కరీంనగర్‌,  పీకల దాకా మద్యం తాగి వచ్చి రోజూ వేధిస్తున్న భర్తను కడతేర్చిన భార్య ఉదంతం కరీంనగర్‌ జిల్లాలో శుక్రవారం జరిగింది. వెల్లటూరు మండలం పాతగూడూరు గ్రామంలో మద్యం తాగి వచ్చి వేధిస్తున్న భర్త గట్టయ్యను భార్య అంజమ్మ…

కరీంనగర్‌ జిల్లాలో బ్యాంకు దోపిడీకి విఫలయత్నం

కరీంనగర్‌, : జిల్లాలోని గంగాధర ఎస్‌బీహెచ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి విఫలయత్నం చేశారు. తలుపులను ధ్వంసం చేసి లోపలకు వెళ్లిన దుండుగులు దోపిడీకి యత్నించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

ఎస్ బీ హెచ్ ఏటీఎంలో చోరికీ దుండగుల యత్నం

కరీంనగర్ : గంగాధర్ చౌరస్తాలోని ఎస్ బీహెచ్ ఏటీఎంలో చోరీకి దుండుగులు విఫలయత్నం చేశారు. ఎస్ బీ హెచ్ ఏటీఎం లో ఈనెల రెండోసారి చోరీకి దుండుగులు యత్నించారు

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: మహిళ మృతి

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీ వద్ద రహదారిపై ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, 12మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు.

యువకుడి దారుణ హత్య

కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమకు అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి అన్నయ్యను ప్రియుడు అతిదారుణంగా హత్యచేసాడు. మెట్‌పల్లిలోని ఈ ఘటన చోటుచేసుకుంది. బీడి కాలనిలో నివాసముంటున్న ఇలియాస్ గతకొంతకాలంగా ఓయువతితో ప్రేమించుకుంటున్నారు. అయితే తరుచూ తమ ప్రేమకు అడ్డుపడుతున్నాడని…