Sunday, 8 November 2026

కరీంనగర్

ఇంటర్మీడియట్‌ సిబ్బందికి 11 నుంచి బదిలీలు

కరీంనగర్‌ ఎడ్యూకేషన్‌, జనంసాక్షి : ఇంటర్మీడియట్‌ విద్యలో పనిచేసే బోధనేతర సిబ్బందికి బదిలీల కౌన్సిలింగ్‌ ఈనెల 11 నుంచి ప్రారంభమవుతుందని జిల్లా వృత్తి విద్యాధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై…

ఎస్‌పీహెచ్‌ఓపై వేటు

జమ్మికుంట, జనంసాక్షి : జమ్మికుంట ప్రభుత్వాస్పత్రిలో రోగి మృతిచెంది ఐదు రోజులు గడిచినా పట్టించుకోని వైద్యుడిపై వేటుపడింది. జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ చర్యలు చేపట్టారు. ఎస్‌పీహెచ్‌ఓ వైద్యుడు అంకూస్‌ను సెలవుల్లో వెళ్లాలని సోమవారం ఆదేశించారు. ఆస్పత్రి విధుల్లో…

నేటి నుంచి ఆరోగ్య శ్రీ వైద్య శిబిరం

భాగ్యనగర్‌,కరీంనగర్‌ జనంసాక్షి : జిల్లాలో నేటి నుంచి ఆరోగ్య శ్రీవైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 7 మంగళవారం రోజున కొడిమ్యాల మండలం నమిలికొండ గ్రామంలో, మే 14న…

సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య, రాస్తారోకో

కరీంనగర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా సరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మరమగ్గాలకు సర్‌చార్జీలు తొలగించాలంటూ ప్రభాకర్‌ అనే కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దాంతో ప్రభాకర్‌ మృతదేహంతో నేతన్నలు సిరిసల్ల చేనేత విగ్రహం ఎదుట రాస్తారోకో నిర్వహించారు.

సన్మాన కార్యక్రమాన్ని బహిష్కరించిన సింగరేణి కార్మికులు

గోదావరిఖని: ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు గనులపై చేపట్టే సన్మాన కార్యక్రమాన్ని కార్మికులు, కార్మిక కుటుంబాలు బహిష్కరించాయి. సన్మాన కార్యక్రమానికి తమను అనుమతించకపోవడంతో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో అధికారులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని కార్మికులు తప్పుపడుతూ…

మావోయిస్టు మాజీ నేత చంద్రన్నపై దాడి కేసు నమోదు

ముత్తారం:మండలం మచ్చుపేటలో మావోయిస్టు మాజీ నేత బందారపు మల్లయ్య అలియాస్‌ చంద్రన్న అదే గ్రామానికి చెందిన చింతల వీరేశం (43) పైవ్యక్తిగత కక్షలతో సోమవారం దాడి చేశారని ఎస్సై ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు. ఆయన కథనం మేరకు పెద్దపల్లిలో…

బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు

కరీంనగర్‌, జనంసాక్షి: బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ అన్నారు. బయ్యారంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు బయ్యారం భూములు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలు…

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన డీసీసీబీ అధ్యక్షుడు రవీందర్‌రావు

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: డీసీసీబీ అధ్యక్షులు కొండూరి రవీందర్‌రావు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెంకటాపూర్‌, హరిదాస్‌నగర్‌, మధిర, ఎల్లారెడ్డిపేట , గొల్లపల్లి, బొప్పాపూర్‌, కోరుట్లపేట, బండలింగపల్లి, గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కేంద్రాలను ఆయన ప్రారంభించారు.…

కుమారుడిని చంపిన కేసులో తండ్రి అరెస్టు

ధర్మసాగర్‌, జనంసాక్షి:కుమారుడ్ని చంపిన కేసులో నిందితుడైన తండిని బుదవారం అరెస్టు చేశామని ధర్మసాగర్‌ సీఐ పి.శ్రీనివాస్‌ తెలిపారు. సీఐతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తి కి చెందిన జోగు వెంకటయ్య (57) కు ముగ్గురు కుమారులున్నారు.…

రైతులు వ్యవసాయ పనిముట్లు వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లును రైతులు వినియోగించుకోవాలని జేడీఏ నరసింహ సూచించారు. నవీపేట మండలం పోతంగల్‌ గ్రామంలో ఈ రోజు రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ వ్యవసాయానికి…