Sunday, 8 November 2026

కరీంనగర్

బంగారు ఆభరణాల చోరీ

హుజురాబాద్‌ గ్రామీణం, జనంసాక్షి: బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని చెప్పి వాటిని చోరీ చేసిన సంఘటన హుజురాబాద్‌ పట్టణంలో సంచలనం కలిగించింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి వచ్చి బండారు ఆభరణాలను మెరుగుపెడతామని చెప్పి ఆభరణాలను తీసుకుని ఒక…

ఎన్టీపీసీలో సాంకేతిక లోపం వల్ల నిలిచిన విద్యుదుత్పత్తి

కరీంనగర్‌, జనంసాక్షి: రామగుండం ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 200 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఉత్పత్తి పునరుద్ధరించేందుకు అధికారులు మరమ్మతుత్త చర్యలు చేపట్టారు.

కొంగగట్టులో దీక్షపరుల మధ్య తోపులాట

కరీంనగర్‌, జనంసాక్షి: మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో ఈ ఉదయం కల్యాణకట్ట వద్ద దీక్షాపరుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో బారికేడ్లు కూలిపోయాయి. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆలయంలో భక్తులకు తగ్గట్లు సరైన…

వడగండ్ల వానతో పంటలకు అపారనష్టం

మంథని గ్రామీణం, జనంసాక్షి: మంతని మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వడగండ్లవానకు ఐదు గ్రామాల్లోని పంటలకు అపార నష్టం వాటిల్లింది. మండలంలోని నాగపల్లి, స్వరపల్లి, వెంకటాపూర్‌, మల్లారం, అడవిసోమనపల్లి గ్రామాల్లో సుమారు గంటసేపు కురిసిన వడగండ్ల వానకు వరిపైరు…

విద్యుదాఘాతంలో అసిస్టెంట్‌ హెల్పర్‌కు తీవ్రగాయాలు

ఎల్లరెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని గొల్లపల్లిలో విద్యుత్తుశాఖలో అసిస్టెంట్‌ హెల్పర్‌గా పనిచేస్తున్న బాలయ్య విద్యుదాఘాతంతో సోమవారం తీవ్రగాయాలపాలయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని వీర్లపల్లి శివారులో అక్రమంగా రెండు ఎడ్లబళ్లలో తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖాధికారులు సోమవారం పట్టుకున్నారు. 40 దుంగల విలువ రూ. 24వేలు ఉంటుందని అధికారులు చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా మానాల పరిధిలోని వీరోలితండాకు చెందిన…

పత్తిధర తగ్గింపునకు నిరసిన్తూ రోడ్డెక్కిన రైతులు

గంగాధర, జనంసాక్షి: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో పత్తి క్వింటాలుకు రూ. 1000 తగ్గింపునకు నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. క్వింటాలు పత్తి రూ. 4,300 ఉంటే రూ. 3వేలకే వ్యాపారాలు ధర నిర్ణయించి దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. వ్యవసాయ…

చిరు వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి

హుజురాబాద్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో బుర్ర శ్రావణ్‌ అనే చిరు వ్యాపారిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. బాధితుడి ఇంటి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన…

పంటనష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌

హుజురాబాద్‌, జనంసాక్షి: వడగండ్ల వానతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో నష్టపోయిన వరి పంట పొలాలను తెరాస శాసనసభాపక్షనేత, స్థానిక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ పరిశీలంచారు. నేలవాలిన, దెబ్బతిన్న వరి ధాన్యాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న వరిపంటకు…

ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ రాస్తారోకో

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: ఢిల్లీలో చిన్నారిపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వేదిక ఆధ్వర్యంలో చిన్నారులు, మహిళాసంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కామారెడ్డి- కరీంనగర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించిన రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి…