Saturday, 7 November 2026

కరీంనగర్

సిరిసిల్లలో ఇల్లు కూలి ఇరువురికి తీవ్ర గాయాలు

కరీంనగర్‌: సిరిసిల్లలో ఉదయం నుంచి కురస్తున్న వర్షానికి పత్తిపాక వీధిలోకి కోత్వాల్‌ లక్ష్మవ్వ ఇల్లు కూలి ఇంటిలో ఉన్న భారతవ్వ, లక్ష్మిలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని సిరిసిల్ల ప్రాంతీయాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.

పెద్దపల్లిలో ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు

కరీంనగర్‌: పెద్దపల్లిలో మహాత్మగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు పార్టీల నాయకులు గాంధీ విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాసవీ క్లబ్‌ వనిత సభ్యలు అనాధలకు దుస్తులు పంపిణీ చేశారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో లైన్స్‌క్లబ్‌…

సిరిసిల్లలో తెలంగాణవాదుల అరెస్టు

సిరిసిల్ల:వేములవాడ , జగిత్యాల, ధర్మపురి, సారంగపూర్‌లనుంచి తెలంగాణ మార్చ్‌కు వెళుతున్న తెలంగాణ మజ్జూర్‌ యూనియన్‌కు చెందిన 150 మందిని పోలిసులు అదుపు లోకి తీసుకున్నారు. అనంతరం వీరిని పోలిసుస్టేషన్‌కు తరలించారు. తెలంగాణ వాదులు పోలిసుస్టేషన్‌లో ధర్నా చేస్తున్నారు.

ఆల్ఫోర్స్‌లో విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్‌: జిల్లా కేంద్రంలోని భగత్‌ నగర్‌లోగల  ఆల్ఫోర్స్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న  మూల వినిత(17)   ఉరివేసుకోని  ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.  కొడిమ్యాల మండలం రామకృష్టపూర్‌ గ్రామాన్నికి చెందిన విద్యార్థిని అని పోలీసులు…

రేచపల్లిలో డెంగీతో యువకుడు మృతి

సారంగపూర్‌ : మండలంలోని రేచపల్లి పరిధిలోని లచ్చనాయక్‌ గిరిజన తండాలో డెంగీతో ఓ యువకుడు మృతి చెందాడు గత వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతున్న తండాకు చెందిన తిరుపతి (22) అనే వ్యక్తిని హైదరాబాద్‌కు తరలించారు. ప్లేట్‌లెట్‌ తగ్గి…

ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సిరిసిల్లకు తరలింపు

కరీంనగర్‌: నిజామాబాద్‌ జిల్లాలో అరెస్టు చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును పోలీసులు కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు తరలించారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్‌ ఎదుట తెరాస కార్యకర్తలతో కలిసి విద్యాసాగర్‌ ఆందోళనకు దిగారు.

గణపతిహోమంలో పాల్గోన్న మంత్రి శ్రీధర్‌బాబు

మంథని పట్టణంలోని రావుల చెరువుకట్ట హనుమాన్‌ అలయంలో నిర్వహించిన గణపతిహమంలో  మంత్రి శ్రీదర్‌బాబు పాల్గోన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. మహలక్ష్మి అలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. లోక కల్యాణం కోసమే గణపతి హోమం  నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.

తెలంగాణ మార్చ్‌కు అనుమతి పోందే బాధ్యత టీ-మంత్రులదే:ఎంపీ వివేక్‌

సుల్తానాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌కు అనుమతి పోందే బాధ్యత తెలంగాణ మంత్రులదేనని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ అన్నారు. ముఖ్యమంత్రి అసమర్దత వల్లే రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని, రాష్ట్ర విభజన జరిగితే విద్యుత్‌ సంక్షోబానికి పరిష్కారం లభిస్తుందన్నారు.

తెలంగాణమార్చ్‌ను విజయవంతం చేయాలని ర్యాలీ

సుల్తానాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని కోరతూ సుల్తానబాద్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహం నుంచి రెండు వేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

కూలిపోయిన వంతెనను నిర్మించాలని ఆందోళన

ఎల్కతుర్తి: ఎస్సారెస్పీ ప్రధాన కాలువపై కూలిపోయిన వంతెనను నిర్మించాలని రైతులు స్థానిక బస్టాండ్‌ వద్ద ఆందోళనకు దిగారు. గ్రామ శివారులోని ఈ వంతెన కూలి రెండెళ్లు అవుతున్నా అధికారులు ఇప్పటికి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.