Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్‌ జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలి

తెలుగుదేశం మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాములు, జైపాల్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోందని వారు ఆరోపించారు.

విద్యుత్తు కోతలకు నిరసనగా రైతుల ఆందోళన

దౌలతాబాద్‌: మండలంలో విద్యుత్తు కోతలకు నిరసనగా మీటూరు, నరసాపురం, కౌడీడు గ్రామాల రైతులు ఎండిన వరి, కంకులను చేతపట్టుకుని మండల కేంద్రంలోని విద్యుత్తు ఉపకేంద్రం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ శాఖ…

జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న న్యాయమూర్తి

ఆలంపూర్‌: ఐదో శక్తి పీఠమైన జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలను హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహన్‌రావు దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు.

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని మన్యంకొండ, షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జిల్లాలోని మన్యంకొండ వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు కుటుంబసభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చోట షాద్‌నగర్‌ సమీపంలో రాయికల్‌…

పదోతరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని పట్టుకున్న డీఈవో

మహబూబ్‌నగర్‌ విద్య: పదోతరగతి పరీక్షల్లో బాలనగర్‌ మండలంలోని బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని డీఈవో సుదర్శన్‌రెడ్డి పట్టుకున్నారు. ఆంగ్లపశ్నపత్రంలో వచ్చిన పశ్నలకు పాఠశాల సిబ్బంది సమాధానాలు రాసి వాటిని జిరాక్స్‌ తీసి విద్యార్థులకు అందించారు.…

పదోతరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని పట్టుకున్న డీఈవో

మహబూబ్‌నగర్‌ విద్య: పదోతరగతి పరీక్షల్లో బాలనగర్‌ మండలంలోని బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో కాపీయింగ్‌ను ప్రోత్సహించిన సిబ్బందిని డీఈవో సుదర్శన్‌రెడ్డి పట్టుకున్నారు. ఆంగ్లపశ్నపత్రంలో వచ్చిన పశ్నలకు పాఠశాల సిబ్బంది సమాధానాలు రాసి వాటిని జిరాక్స్‌ తీసి విద్యార్థులకు అందించారు.…

గుర్తు తెలియని వ్యక్తి మృతి

బొమ్మరాజుపేట: మండలంలోని మెట్టకుంట శివారులో బీజాపూర్‌ అంతరాష్ట్ర రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మతి స్థిమితం లేకుండా తిరుగుతూ ఎండ తీవ్రతతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గ్రామ రెవెన్యూ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు…

ప్రజాప్రయోజనాలకు బ్యాంకుల దోహదం

బాలానగర్‌: ఆర్థిక పరమైన ప్రజాప్రయోజనాలకు బ్యాంకులు దోహదపడతాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ జనరల్‌ మేనేజర్‌ వెంకరామన్‌ అన్నారు. గురువారం బాలానగర్‌ మండలం ఉడిత్యాల గ్రామంలో ఎన్‌బీహచ్‌ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 నుంచి…

చేనేత కార్మికుల నిరాహారదీక్ష

వడ్డేపలి: మండలంలోని రాజోలి గ్రామంలో నాలుగు రోజులుగా చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. గ్రామంలో ప్రభుత్వం నిర్మిస్తున్న వరద గృహాలలో చేనేత కార్మికులుకు ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్‌ చేస్తునారు. తమ సమస్యలను తీరేదాకా పోరాడుతామని వారు…

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ, ఒకరి మృతి

వడ్డేపల్లి: మండలంలోని శాంతినగర్‌-పైపాడు రహదారి మధ్యలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.